Jordar Sujatha|తండ్రి కాబోతున్న‌ట్టు అఫీషియ‌ల్‌గా ప్ర‌క‌టించిన రాకింగ్ రాకేష్‌.. వైర‌ల్ అవుతున్న సుజాత బేబి బంప్ ఫొటోస్

Jordar Sujatha| జ‌బ‌ర్ధ‌స్త్ కామెడీతో గుర్తింపు తెచ్చుకున్న వారిలో రాకింగ్ రాకేష్ ఒక‌రు. చిన్న పిల్ల‌ల‌తో క‌లిసి ఎక్కువ‌గా స్కిట్స్ చేసిన రాకింగ్ రాకేష్ త‌న టీంలోకి జోర్ధార్ సుజాత‌ని కూడా చేర్చుకున్నాడు. ఇక వారిద్ద‌రు క‌లిసి స్టేజ్‌పై తెగ సంద‌డి చేసేవారు. పంచులు, సెటైర్ల‌తో తెగ న‌వ్వించేవారు. ఇక ఆ త‌ర్వాత ఇద్ద‌రి

  • By: sn    cinema    Aug 04, 2024 7:55 AM IST
Jordar Sujatha|తండ్రి కాబోతున్న‌ట్టు అఫీషియ‌ల్‌గా ప్ర‌క‌టించిన రాకింగ్ రాకేష్‌.. వైర‌ల్ అవుతున్న సుజాత బేబి బంప్ ఫొటోస్

Jordar Sujatha| జ‌బ‌ర్ధ‌స్త్ కామెడీతో గుర్తింపు తెచ్చుకున్న వారిలో రాకింగ్ రాకేష్ ఒక‌రు. చిన్న పిల్ల‌ల‌తో క‌లిసి ఎక్కువ‌గా స్కిట్స్ చేసిన రాకింగ్ రాకేష్ త‌న టీంలోకి జోర్ధార్ సుజాత‌ని కూడా చేర్చుకున్నాడు. ఇక వారిద్ద‌రు క‌లిసి స్టేజ్‌పై తెగ సంద‌డి చేసేవారు. పంచులు, సెటైర్ల‌తో తెగ న‌వ్వించేవారు. ఇక ఆ త‌ర్వాత ఇద్ద‌రి మ‌ధ్య ప్రేమ పుట్టి నిజ జీవితంలోనూ కపుల్ గా మారారు. ఇదే జబర్దస్త్ వేదికపైనే రాకేష్- సుజాత తమ ప్రేమను అధికారికంగా ప్రకటించారు. కొన్నాళ్ల‌కి ఇరు కుటుంబ పెద్దల అంగీకారంతో పెళ్లి పీట‌లు కూడా ఎక్కారు. అయితే కొద్ది రోజులుగా సుజాత ప్ర‌గ్నెంట్ అంటూ నెట్టింట తెగ ప్ర‌చారాలు జ‌రుగుతుండ‌గా, దీనిపై సుజాత కాని రాకేష్ కాని స్పందించింది లేదు.

తాజాగా వీళ్లిద్దరు తమ అభిమానులకు ఒక గుడ్ న్యూస్ చెప్పారు. ఇన్నాళ్లు చెప్పకుండా ఇప్పుడు రివీల్ చేస్తున్నాం అంటూ.. తాము తల్లిదండ్రులు కాబోతున్నార‌నే విష‌యాన్ని సోష‌ల్ మీడియా ద్వారా తెలియ‌జేశారు. మంచి స‌మ‌యం చూసి చెప్పాల‌నే భావించి ఈ విష‌యాన్ని సీక్రెట్ గా ఉంచామ‌ని సుజాత పేర్కొంది. రాకింగ్ రాకేశ్ తండ్రి కాబోతున్నాడు అంటూ సుజాత చెప్తుండగా.. రాకేశ్ కాస్త ఎమోషనల్ అయ్యాడు. ఇక తాజాగా సీమంతం వేడుక నిర్వ‌హించినట్టు తెలుస్తుండ‌గా, వాటికి సంబంధించిన ఫొటోల‌ని కూడా షేర్ చేసిన‌ట్టు తెలుస్తుంది. ప్ర‌స్తుతం ఈ పిక్స్ వైర‌ల్‌గా మారాయి.

“ఒక మంచి సందర్భం చూసి ఈ విషయాన్ని మీకు తెలియజేయాలి అని వెయిట్ చేశాం. ఇదే ఆ సందర్భం అనిపించింది. మా ఇద్దరి ప్రేమకు ప్రతిరూపం ఈ భూమి మీదకు రాబోతోంది. ఆయన ఇలా ఏడవడం, ఆయన అందమైన గడ్డాన్ని పెంచుకోవడం నాకు బాగా నచ్చింది” అంటూ సుజాత కామెంట్ చేసింది. ఇక త‌న‌కి తండ్రి ప్ర‌మోష‌న్ ద‌క్కేలా చేసిన సుజాత‌కి థ్యాంక్స్ చెప్పాడు రాకేష్‌. సుజాత అత్త గారు కూడా ఈ శుభవార్తను చెప్పినందుకు ఎంతో సంతోషంగా ఉంది.ప్ర‌స్తుతం రాకింగ్ రాకేష్ ఇంట సంతోషం వెల్లివిరిసింది. ఇక బుల్లి రాకేష్ త్వ‌ర‌లోనే అడుగుపెట్ట‌బోతున్నాడు అంటూ నెటిజ‌న్స్ సోష‌ల్ మీడియాలో తెగ హంగామా చేస్తున్నారు.