NTR|ర‌ణ్‌బీర్,అలియా, హృతిక్‌ల‌తో బాంద్రాలో క‌నిపించిన జూనియ‌ర్ ఎన్టీఆర్

NTR| యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ గత కొన్ని రోజులుగా వార్ 2 సినిమా షూటింగ్‌తో బిజీగా ఉంటున్న విష‌యం తెలిసిందే.దేవ‌ర చిత్ర షూటింగ్‌కి బ్రేక్ ఇచ్చిన ఆయ‌న ఇప్పుడు వార్ 2 చిత్రం కోసం ప‌ని చేస్తున్నారు.ఇటీవలే వార్ 2 సెట్స్ లోకి ఎంట్రీ ఇచ్చిన ఎన్టీఆర్.. మొదటి షెడ్యూల్ ని పూర్తీ చేసి హైదరాబాద్ తిరిగి వ

  • By: sn    cinema    Apr 29, 2024 7:22 AM IST
NTR|ర‌ణ్‌బీర్,అలియా, హృతిక్‌ల‌తో బాంద్రాలో క‌నిపించిన జూనియ‌ర్ ఎన్టీఆర్

NTR| యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ గత కొన్ని రోజులుగా వార్ 2 సినిమా షూటింగ్‌తో బిజీగా ఉంటున్న విష‌యం తెలిసిందే.దేవ‌ర చిత్ర షూటింగ్‌కి బ్రేక్ ఇచ్చిన ఆయ‌న ఇప్పుడు వార్ 2 చిత్రం కోసం ప‌ని చేస్తున్నారు.ఇటీవలే వార్ 2 సెట్స్ లోకి ఎంట్రీ ఇచ్చిన ఎన్టీఆర్.. మొదటి షెడ్యూల్ ని పూర్తీ చేసి హైదరాబాద్ తిరిగి వచ్చారు. ఇక మ‌ళ్లీ సెకండ్ షెడ్యూల్ కోసం ముంబై వెళ్లారు. ప్రస్తుతం అక్కడే వార్ 2 షూటింగ్ లో పాల్గొంటున్నారు. అయితే ఎన్టీఆర్ వార్ 2 మూవీకి సంబంధించి తన మాక్ ఓవర్ అండ్ లుక్ ని సీక్రెట్ గా ఉంచడం కోసం చాలా క‌ష్ట‌ప‌డుతున్నాడు. ఎక్క‌డా రివీల్ చేయ‌కుండా ప‌లు జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్నాడు. అత‌నిని ఫోటోస్ తీస్తే కూడా సీరియ‌స్ అవుతున్నాడు.

వార్ 2లో ఎన్టీఆర్ ఏజెంట్‌గా క‌నిపించ‌నున్న‌ట్టు టాక్. గ‌త కొద్ది రోజులుగా వార్‌2 షూటింగ్‌తో బిజీగా ఉంటున్న తార‌క్ మధ్య మ‌ధ్య‌లో బాలీవుడ్ సెల‌బ్స్‌తో క‌లిసి సంద‌డి చేస్తున్నాడు.తాజాగా ర‌ణ్‌బీర్, అలియా జంట‌తో పాటు హృతిక్ రోష‌న్-స‌బా ఆజాద్ జంట‌తో క‌లిసి డిన్న‌ర్ డేట్‌కి వెళ్లాడు. బాంద్రాలోని ఓ రెస్టారెంట్‌లో వీరు క‌లుసుకోగా, అందుకు సంబంధించిన ఫొటోలు ఇప్పుడు నెట్టింట హ‌ల్‌చ‌ల్ చేస్తున్నాయి. క‌రణ్ జోహార్ సైతం వీరితో క‌లిసి ఉండ‌డం మ‌నం గ‌మ‌నించ‌వ‌చ్చు. ప్ర‌స్తుతానికి ఇందుకు సంబంధించిన ఫొటోలు నెట్టింట తెగ హ‌ల్‌చ‌ల్ చేస్తున్నాయి.

ఇక ఇదిలా ఉంటే వార్ 2 సినిమా కోసం జూనియర్ ఎన్టీఆర్ 60 రోజుల కాల్షీట్స్ కేటాయించిన‌ట్టు టాక్ న‌డుస్తుంది.. వార్1 ను మించిపోయేలా వార్2 సినిమా ఉండబోతుందని తెలుస్తోంది. 2025 ఆగష్టు 14వ తేదీన ఈ సినిమా థియేటర్లలో రానుంది. మ‌రోవైపు దేవ‌ర సినిమా షూటింగ్‌తో కూడా బిజీగా ఉన్నారు ఎన్టీఆర్. ఈ సినిమా కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్క‌నుంది. ఆగ‌స్ట్‌లో మూవీని ప్రేక్ష‌కుల ముందుకు తీసుకొచ్చే ప్లాన్ చేస్తున్నారు. దేవర సినిమా ప్రమోషన్స్ కూడా త్వరలో మొదలుకానున్నాయని తెలుస్తోంది. దేవర సినిమాతో కెరీర్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకుంటానని ఈ స్టార్ హీరో ఫీలవుతున్నారని ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా వినిపిస్తుండటం గమనార్హం.