Kalki Bhairava Anthem| క‌ల్కి నుండి ఫ‌స్ట్ సాంగ్ వ‌చ్చేసింది.. అలా చేయ‌డంతో ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్న అభిమానులు

Kalki Bhairava Anthem|  స‌లార్ త‌ర్వాత ప్ర‌భాస్ చేస్తున్న కల్కి 2898 ఏడీ మూవీపై అంచ‌నాలు ఏ రేంజ్‌లో ఉన్నాయో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు.ఈ సినిమా జూన్ 27వ తేదీన రిలీజ్ కానున్న నేప‌థ్యంలో ప్ర‌మోష‌న్స్ వేగ‌వంతం చేశారు. ఈ మూవీ నుంచి ఫస్ట్ సాంగ్ ఎప్పుడు వస్తుందా అని సినీ

  • By: sn    cinema    Jun 17, 2024 2:55 PM IST
Kalki Bhairava Anthem| క‌ల్కి నుండి ఫ‌స్ట్ సాంగ్ వ‌చ్చేసింది.. అలా చేయ‌డంతో ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్న అభిమానులు

Kalki Bhairava Anthem|  స‌లార్ త‌ర్వాత ప్ర‌భాస్ చేస్తున్న కల్కి 2898 ఏడీ మూవీపై అంచ‌నాలు ఏ రేంజ్‌లో ఉన్నాయో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు.ఈ సినిమా జూన్ 27వ తేదీన రిలీజ్ కానున్న నేప‌థ్యంలో ప్ర‌మోష‌న్స్ వేగ‌వంతం చేశారు. ఈ మూవీ నుంచి ఫస్ట్ సాంగ్ ఎప్పుడు వస్తుందా అని సినీ ప్రేక్షకులు ఎదురుచూస్తున్న‌ స‌మ‌య‌లో భైరవ ఆంథమ్ అంటూ ఈ చిత్రం నుంచి ఫస్ట్ సాంగ్ విడుద‌ల చేసింది. ప్రభాస్, దిల్‍జీత్ సింగ్ తెగ సంద‌డి చేశారు. అయితే ఈ పాట‌లో తెలుగు, హిందీ ప‌దాలు ఉన్నాయి. ఇది విన్న వారు అది తెలుగు పాట‌నా, హిందీ పాటనా, పంజాబీ పాట‌నా అనేది ఎవ‌రికి అర్ధం కావ‌డం లేదు. ప్ర‌మోష‌న‌ల్ సాంగ్‌గా ఈ పాట‌ని విడుదల చేయగా, ఇది ఎంత వ‌ర‌కు రీచ్ అవుతుంద‌ని రానున్న రోజుల‌లో తెలియ‌నుంది.

గ‌త మూడు రోజుల నుండి ఊద‌ర‌గొడుతూ పాట‌ని వాయిదాల మీద వాయిదాలు వేస్తూ చివ‌రికి ఇవాళ రిలీజ్ చేసిన మేక‌ర్స్ తెలుగు ఆడియ‌న్స్‌ని నిరాశ‌ప‌రిచారంటూ కొందరు ఫ్యాన్స్ ఆగ్ర‌హం వ్యక్తం చేస్తున్నారు. సంతోష్ నారాయణ్ ఈ పాటకు మంచి ట్రెండీ ఫాస్ట్ బీట్ ఇచ్చినట్టు అనిపిస్తోంది. ఈ ఫస్ట్ సాంగ్‍ను నార్త్ ఆడియన్స్‌ను ఎక్కువగా దృష్టిలో పెట్టుకొని రూపొందించినట్టు తెలుస్తోంది. హిందీలో మరింత బజ్ కోసం ఈ పాట ఉపయోగపడుతుందని మూవీ టీమ్ భావిస్తోంది. చిత్ర ప్ర‌మోష‌న్‌లో భాగంగా ఇప్ప‌టి వ‌ర‌కు ఒక్క ఈవెంట్ మాత్ర‌మే నిర్వ‌హించారు మేక‌ర్స్. ఫ్యుచరిస్టిక్ కారు ‘బుజ్జి’ పరిచయం చేసే ఈవెంట్ మాత్రమే నిర్వ‌హించ‌గా, త్వ‌ర‌లో రెండు తెలుగు రాష్ట్రాల‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వ‌హించ‌నున్నార‌ని టాక్.

కల్కి 2898 ఏడీ సినిమాలో ప్రభాస్‍తో పాటు అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొణ్, దిశా పటానీ, స్వస్తత ఛటర్జీ, రాజేంద్ర ప్రసాద్ కీలకపాత్రలు పోషించారు. వైజయంతీ మూవీస్ పతాకంపై అశ్వినీదత్ ఈ మూవీని నిర్మించారు. ఇలా స్టార్ నటీనటులు చాలా మంది ఈ సినిమాలో నటిస్తుండగా దాదాపు 400 కోట్ల భారీ బడ్జెట్ తో ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. స‌లార్ క‌న్నా ఈ సినిమా భారీ హిట్ కొడుతుంద‌ని ఫ్యాన్స్ భావిస్తున్నారు.