Upendra । ఉపేంద్ర కోసం అల్లు అర్జున్?
కన్నడ విలక్షణ నటుడు ఉపేంద్ర నటించిన యూఐ సినిమా డిసెంబర్ 20న దేశవ్యాప్తంగా వివిధ భాషల్లో విడుదల కానున్నది.

Upendra । కన్నడ సూపర్‌స్టార్ ఉపేంద్ర చాలా సంవత్సరాల గ్యాప్ తర్వాత నటిస్తూ దర్శకత్వం వహించిన చిత్రం యూఐ. డిసెంబర్ 20న ప్రపంచవ్యాప్తంగా పాన్ ఇండియా చిత్రంగా అనేక భాషల్లో థియేటర్లలో విడుదలకానుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ చేసిన పాట, ఇటీవల వచ్చిన టీజర్ సినిమాపై ఓ రేంజ్లో అంచనాలను పెంచేయడమే గాక ఏ, ఊపేంద్ర లాంటి చిత్రాన్ని తీసుకొస్తున్నాడనే క్రేజ్ అభిమానుల్లో పెరిగింది. ఈ మూవీ రిలీజ్ దగ్గర పడడంతో ఉపేంద్రతో పాటు మేకర్స్ దేశ వ్యాప్తంగా తిరుగుతూ తమ సినిమాను జనాల్లోకి తీసుకెళుతున్నారు. ఈ నేపథ్యంలో శనివారం హైద్రాబాద్‌కు వచ్చిన ఉపేంద్ర అల్లు అర్జున్ను తన నివాసంలో కలిసి సంఘీభావం తెలిపి అనంతరం పలు ఈవెంట్లలో పాల్గొన్నారు. అయితే ఈ సినిమాకు సంబంధించిన ప్రీ రిలీజ్ పంక్షన్‌కు అల్లు అర్జున్ ముఖ్య అతిథిగా హజరవనున్నారనే వార్త ఇప్పుడు సోషల్ మీడియాల్లో, సినీ వర్గాల్లో తెగ వైరల్ అవుతోంది. అయితే రెండు రోజులుగా జరుగుతున్న సమస్యల దృష్ట్యా అల్లు అర్జున్ మరి ఈ కార్యక్రమంలో పాల్గొంటాడా లేదా అనే అనుమానాలైతే ఉన్నాయి.ఇదిలాఉండగా గతంలో అల్లు అరజ్ఉన్, ఉపేంద్ర ఇద్దరు సన్నాఫ్ సత్యమూర్తి అనే సినిమాలో కలిసి నటించారు.