Upasana | కూతురికి.. రాత్రి స‌మ‌యంలో గ‌ట్టి కాప‌లా ఉంచిన ఉపాస‌న‌..!

Upasana: పెళ్లైన పదకొండేళ్ల తర్వాత రామ్ చ‌ర‌ణ్, ఉపాస‌న దంప‌తులు తొలిసారి తల్లిదండ్రులుగా ప్రమోషన్ అందుకున్న విషయం తెలిసిందే. జూన్ 20న జూబ్లీహిల్స్ లోని అపోలో ఆసుపత్రిలో ఉపాసన పండంటి ఆడబిడ్డకు జ‌న్మ‌నివ్వ‌డంతో మెగా ఇంట సంతోషం వెల్లి విరిసింది. మెగా అభిమానులు సైతం ఫుల్ ఖుష్ అయ్యారు. ఇక జూన్ 30న ఉపాస‌న త‌ల్లిగారింట్లో నామ‌క‌ర‌ణ వేడుక నిర్వ‌హించ‌గా, ఆ వేడుక‌లో మెగా వారసురాలికి ‘క్లింకారా’ అని నామకరణం కూడా చేశారు. ఇక క్లింకారా పుట్టినప్ప‌టి నుండి […]

  • By: sn    cinema    Jul 19, 2023 11:17 AM IST
Upasana | కూతురికి.. రాత్రి స‌మ‌యంలో గ‌ట్టి కాప‌లా ఉంచిన ఉపాస‌న‌..!

Upasana: పెళ్లైన పదకొండేళ్ల తర్వాత రామ్ చ‌ర‌ణ్, ఉపాస‌న దంప‌తులు తొలిసారి తల్లిదండ్రులుగా ప్రమోషన్ అందుకున్న విషయం తెలిసిందే. జూన్ 20న జూబ్లీహిల్స్ లోని అపోలో ఆసుపత్రిలో ఉపాసన పండంటి ఆడబిడ్డకు జ‌న్మ‌నివ్వ‌డంతో మెగా ఇంట సంతోషం వెల్లి విరిసింది. మెగా అభిమానులు సైతం ఫుల్ ఖుష్ అయ్యారు. ఇక జూన్ 30న ఉపాస‌న త‌ల్లిగారింట్లో నామ‌క‌ర‌ణ వేడుక నిర్వ‌హించ‌గా, ఆ వేడుక‌లో మెగా వారసురాలికి ‘క్లింకారా’ అని నామకరణం కూడా చేశారు. ఇక క్లింకారా పుట్టినప్ప‌టి నుండి ఆ చిన్నారికి సంబంధించి రామ్ చ‌రణ్‌- ఉపాస‌న దంప‌తులు ప్ర‌త్యేక శ్ర‌ద్ధ తీసుకుంటున్నారు. తమ కుమార్తె అత్యుత్తమంగా మంచి వాతావరణంలో పెరిగేలా బెస్ట్ ఇంటీరియర్ డిజైన్ తో ప్ర‌త్యేక గ‌దిని అందంగా తీర్చిదిద్దారు.

ఫారెస్ట్ థీమ్ తో రూపొందిచిన గ‌దికి సంబంధించిన వీడియోని ఉపాస‌న త‌న సోష‌ల్ మీడియా ద్వారా తెలియ‌జేసింది. ఇందులో ఫారెస్ట్ లా ఆర్ట్స్ గియించి గోడలకు అంటించారు. ప్ర‌త్యేకంగా ఈ గ‌దిని త‌యారు చేయించ‌డం కోసం రామ్ చ‌ర‌ణ్ దంప‌తులు భారీగానే ఖ‌ర్చు చేసిన‌ట్టు స‌మాచారం. ఇక రీసెంట్‌గా ఉపాస‌న త‌న కూతురికి రాత్రి స‌మ‌యంలో గ‌ట్టి సెక్యూరిటీని ఏర్పాటు చేసింది.రాత్రి స‌మ‌యంలో క్లింకారా సంర‌క్ష‌ణ బాధ్య‌త‌ల‌న్నింటిని బిగ్ బ్రదర్ తీసుకున్న‌ట్టు ఉపాస‌న చెప్పుకొచ్చింది. మ‌రి ఇంత‌కు ఆ బిగ్ బ్ర‌ద‌ర్ ఎవ‌ర‌నే క‌దా మీ డౌట్.. క్లింకార జ‌న్మించ‌డానిక‌న్నా ముందు రామ్ చ‌ర‌ణ్ దంప‌తులు రైమ్ అనే పెంపుడు కుక్కని పెంచుకుంటున్నారు.

రైమ్‌ని చాలా అన్యోన్యంగా చూసుకుంటూ, త‌ను ఎక్క‌డికి వెళ్లిన దానిని వెంట తీసుకెళ్ల‌డం వంటివి చేశాడు రామ్ చ‌ర‌ణ్‌. దీనిని తమ పెద్ద కొడుకుగా భావిస్తున్నారు రామ్ చ‌ర‌ణ్ దంప‌తులు. అయితే ఇప్పుడు రైమ్‌కి క్లింకారని రాత్రి స‌మ‌యంలో చూసుకునే బాధ్య‌త‌లు అప్ప‌గించారు.నైట్ టైమ్‌లో క్లింకార ప‌డుకున్న కాట్‌ని రైమ్ అబ‌ర్వ్ చేస్తుండ‌గా, అప్పుడు ఫోటో తీసి రైమ్ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తే.. నా చెల్లెలు నైట్‌ డూటీపై ఓ కన్ను వేసాను అంటూ క్యాప్ష‌న్‌గా రాసారు. కాగా రైమ్‌కి కూడా ప్ర‌త్యేక సోష‌ల్ మీడియా అకౌంట్ ఏర్పాటు చేసిన ఉపాస‌న దంప‌తులు ఎప్ప‌టిక‌ప్పుడు దానికి సంబంధించిన ఫొటోల‌ని షేర్ చేస్తూ అల‌రిస్తుంటారు.