Mahesh Babu| మ‌హేష్ బాబు-రాజ‌మౌళి సినిమాపై త‌ప్పుడు ప్ర‌చారాలు.. ఖండిస్తూ ప్ర‌క‌ట‌న విడుద‌ల‌

Mahesh Babu| ఆర్ఆర్ఆర్ సినిమా త‌ర్వాత రాజ‌మౌళి.. సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబుతో కలిసి ఓ మూవీ చేయ‌బోతున్న విష‌యం తెలిసిందే. ఈ సినిమాని హాలీవుడ్ రేంజ్‌లో తెర‌కెక్కిస్తున్నారు. గత కొద్ది రోజులుగా మూవీకి సంబంధించిన ప్రీ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయి.ఈ సినిమా

  • By: sn    cinema    May 17, 2024 11:30 AM IST
Mahesh Babu| మ‌హేష్ బాబు-రాజ‌మౌళి సినిమాపై త‌ప్పుడు ప్ర‌చారాలు.. ఖండిస్తూ ప్ర‌క‌ట‌న విడుద‌ల‌

Mahesh Babu| ఆర్ఆర్ఆర్ సినిమా త‌ర్వాత రాజ‌మౌళి.. సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబుతో కలిసి ఓ మూవీ చేయ‌బోతున్న విష‌యం తెలిసిందే. ఈ సినిమాని హాలీవుడ్ రేంజ్‌లో తెర‌కెక్కిస్తున్నారు. గత కొద్ది రోజులుగా మూవీకి సంబంధించిన ప్రీ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయి.ఈ సినిమా కోసం మహేష్ బాబు కూడా బాగా జుట్టు పెంచి, బాడీ మీద ఫోకస్ చేసిన‌ట్టుగా మ‌న‌కు అర్ధ‌మవుతుంది. ఉగాదికి మూవీ ప్రారంభం అవుతుంద‌ని అంద‌రు భావించారు. కాని ఈ మూవీ లాంచింగ్‌కి మ‌రింత స‌మ‌యం ప‌ట్టేలా ఉంది. ఇక ఈ సినిమా కోసం ప‌ని చేసేందుకు టెక్నీషియ‌న్స్, న‌టీన‌టులు ఎంతో ఆస‌క్తి చూపుతున్నారు.

ఈ క్ర‌మంలోనే మూవీకి సంబంధించి అనేక వార్త‌లు నెట్టింట హ‌ల్‌చ‌ల్ చేస్తున్నాయి. గ‌త రెండు మూడు రోజుల నుండి SSMB29 సినిమాకు వీరేన్ స్వామి క్యాస్టింగ్ డైరెక్టర్ అని జాతీయ ఆంగ్ల పత్రిక ఓ కథనం ప్రచురించింది. చియాన్ విక్రమ్ న‌టించిన‌ ‘అపరిచితుడు, మహేష్ ‘వన్ నేనొక్కడినే’ సినిమాకూ ఆయ‌న‌ పని చేశారని ఆ కథనంలో వివరించింది.అయితే ఈ వార్త‌ల‌ని ఖండిస్తూ ప్రొడక్షన్ హౌస్ శ్రీ దుర్గా ఆర్ట్స్ అధినేత, చిత్ర నిర్మాత కెఎల్ నారాయణ (లక్ష్మీ నారాయణ కాజా) వివరణ ఇచ్చారు. వీరేన్ స్వామితో తమకు గానీ తమ సినిమాకు గానీ సంబంధం లేదని , సినిమాకు సంబందించిన సమాచారం ఏదైనా ఉంటే ప్రొడక్షన్ హౌస్ ద్వారా తెలియ‌జేస్తామ‌ని వివ‌ర‌ణ ఇచ్చారు.

మరి ఈ లేఖతో అయినా SSMB29 సినిమాపై వచ్చే పుకార్లు ఆగుతాయా లేదా అనేది చూడాల్సి ఉంది. ఇక నెటిజ‌న్స్ అయితే మూవీ నుండి ఏదైన అప్‌డేట్ ఇవ్వ‌మ‌ని అడుగుతున్నారు. ప్రతి ఏడాది మ‌హేష్ బాబు త‌న తండ్రి జన్మదినం సందర్భంగా తన కొత్త సినిమాకు సంబధించి ఏదో ఒక అప్డేట్ ఇవ్వడం చూస్తూనే ఉన్నాం. అయితే ఈ సారి కూడా మ‌హేష్ బాబు 29వ సినిమాకి సంబంధించి కూడా ఏదో ఒక అప్‌డేట్ రానున్న‌ట్టు తెలుస్తుంది.