Majili|మజిలి సినిమా చైల్డ్ ఆర్టిస్ట్ ఇప్పుడు ఇంత హాట్‌గా మారిందేంటి..!
Majili| మజిలి సినిమా పేరు చెబితే వెంటనే సమంత- నాగ చైతన్య జంట గుర్తుకు వస్తుంది. పెళ్లైన తర్వాత వారిద్దరు కలిసి ఈ సినిమాలో నటించారు. శివా నిర్వాణ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా చాలా పెద్ద విజయం సాధించింది.2019లో ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రాగా, ఇందులో నాగ చైత

Majili| మజిలి సినిమా పేరు చెబితే వెంటనే సమంత- నాగ చైతన్య జంట గుర్తుకు వస్తుంది. పెళ్లైన తర్వాత వారిద్దరు కలిసి ఈ సినిమాలో నటించారు. శివా నిర్వాణ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా చాలా పెద్ద విజయం సాధించింది.2019లో ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రాగా, ఇందులో నాగ చైతన్య, సమంత భార్య భర్తలుగానే కనిపించి సందడి చేశారు. రూ. 20 కోట్ల పెట్టి సినిమా తీస్తే.. సుమారు రూ. 70 కోట్లు వసూలు రాబట్టింది ఈ చిత్రం. నాగ చైతన్య కెరీర్‌లోనే అత్యధిక వసూళ్లు వచ్చిన చిత్రంగా మజిలీ నిలిచిపోతుంది. ఇందులో ‘ప్రియతమా ప్రియతమా‘, ఏ మనిషికి ఏ మజిలీయో పైవాడు చూపిస్తాడు’ సాంగ్స్ అయితే ఇప్పటికీ వినసొంపుగానే ఉంటాయి.
ఇందులో సమంత తన నటనతో అదరగొట్టింది. భర్త ప్రేమ కోసం పరితపించిపోయే భార్య పాత్రలో జీవించేసింది అని చెప్పాలి. శ్రావణి పాత్రకి ప్రాణం పోసింది అని చెప్పాలి. ఇక నాగ చైతన్య కూడా వెరైటీ పాత్ర పోషించి అదరగొట్టాడు. విరహా ప్రేమికుడిగా ఆయన అదరగొట్టాడు. ఇక ఇందులో నాగచైతన్య మాజీ లవర్ కూతురుగా మీరా పాత్ర ఒకటి ఉంటుంది. ఆ పాత్ర ఎంటర్ అయ్యాక సినిమా మొత్తం వేరే రూట్‌లోకి వెళుతుంది. అయితే మజిలి చిత్రంలో చైల్డ్ ఆర్టిస్ట్‌గా నటించిన ఆమె ఇప్పుడు చాలా పెద్దగా అయింది. హాట్ లుక్‌లో దర్శనమిస్తూ అదరగొడుతుంది.ఆమె పేరు అనన్య అగర్వాల్ కాగా, 2004లో ముంబయిలో పుట్టింది. ఇప్పుడు ఆమెకి 20 ఏళ్లు వచ్చేశాయి. 2008 నుండి బుల్లితెరపై రాణిస్తుంది.
తుజ్ సంగ్ ప్రీత్ లగై సజ్నాతో టీవీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన అనన్య ..ఇస్ ప్యార్ కో క్యా నామ్ దూన్? క్యా హువా తేరా వాద, మహా భారత్, సియా కే రామ్ వంటి సీరియల్లో నటించింది. ఇవే కాకుండా వాణిజ్య ప్రకటనల్లో కూడా కనిపించింది. అయితే మజిలి సినిమాతో మంచి పేరు తెచ్చుకుంది. ఇప్పుడు టీవీ, వెండితెరపై కనిపిస్తూ సందడి చేస్తుంది. మరోవైపు సోషల్ మీడియాలో యమ బిజీగా మారిపోయింది. సోషల్ మీడియాలో బ్రాండ్స్ ప్రమోషన్స్ చేస్తూ కనిపిస్తూ హడావిడి చేస్తుంది. అయితే ఇప్పుడు అనన్యని చూసి ఇంత పెద్దగా అయిందేంటి అందరు అవాక్కవుతున్నారు.
View this post on Instagram