Meenakshi Chaudhary | లక్కీ ఛాన్స్ కొట్టేసిన మీనాక్షి చౌదరి.. అదే నిజమైతే ఇక తిరుగే ఉండదు..!
Meenakshi Chaudhary | మీనాక్షి చౌదరి ప్రస్తుతం టాలీవుడ్‌లో ట్రెండింగ్ హీరోయిన్‌గా మారింది. వరుస సినిమాలు చేస్తూ ఫుల్ బిజీ హీరోయిన్‌గా మారింది. 2018లో మిస్ గ్రాండ్ ఇండియా టైటిల్‌ని నెగ్గింది. 2019లో హిందీలో అప్‌స్టార్ మూవీతో సినీరంగ ప్రవేశం చేసింది. ‘ఇచ్చట వాహననములు నిలుపరాదు’ మూవీతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది.

Meenakshi Chaudhary | మీనాక్షి చౌదరి ప్రస్తుతం టాలీవుడ్‌లో ట్రెండింగ్ హీరోయిన్‌గా మారింది. వరుస సినిమాలు చేస్తూ ఫుల్ బిజీ హీరోయిన్‌గా మారింది. 2018లో మిస్ గ్రాండ్ ఇండియా టైటిల్‌ని నెగ్గింది. 2019లో హిందీలో అప్‌స్టార్ మూవీతో సినీరంగ ప్రవేశం చేసింది. ‘ఇచ్చట వాహననములు నిలుపరాదు’ మూవీతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత కిలాడీ, హిట్-2 సినిమాల్లో నటించింది. ఈ సినిమాల తర్వాత సూపర్ స్టార్ మహేశ్‌బాబు, త్రివిక్రమ్ కాంబోలో వచ్చిన ‘గుంటూరు కారం’లో ఛాన్స్ దక్కించుకుంది. అయిత మహేశ్ బాబుకు మరదలుగా కనిపించింది. ఈ మూవీలో మీనాక్షి రోల్‌కు పెద్దగా ప్రాధాన్యం కనిపించలేదు. అయితే, దర్శకుడు త్రివిక్రమ్ దృష్టిలోపడింది. దాంతో గురూజీ వరుసగా ఛాన్స్‌లు ఇప్పిస్తున్నారని తెలుస్తున్నది.
తాజాగా లక్కీ భాస్కర్ మూవీతో బ్లాక్ బస్టర్ హిట్‌ని అందుకున్నది. దీపావళికి విడుదల ఈ మూవీ ప్రస్తుతం పాజిటివ్ టాక్‌తో దూసుకెళ్తుంది. ప్రస్తుతం మెగా హీరో వరుణ్ తేజ్ సరసన ‘మట్కా’లో నటిస్తున్నది. అలాగే, వెంకటేశ్, అనిల్ రావిపూడి కాంబోలో వస్తున్న ‘సంక్రాంతికి వస్తున్నాం’ మూవీల్లోనూ నటిస్తున్నది. అలాగే, విశ్వక్‌సేనతో ‘మెకానిక్ రాకీ’ మూవీలో జతకడుతున్నది. తాజాగా మరో లక్కీ ఛాన్స్ కొట్టేసినట్లు టాలీవుడ్‌లో ఫిలిం సర్కిల్స్‌లో వార్తలు వస్తున్నాయి. మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న ‘విశ్వంభర’ మూవీలో అవకాశం దక్కించుకున్నట్లు సమాచారం. వశిష్ట మల్లిడి దర్శకత్వం వహిస్తున్నారు. మీనాక్షి దేవకన్య పాత్రలో కనిపించనున్నట్లు తెలుస్తున్నది. ఇందులో ఎంత వరకు నిజం ఉందో తెలియదు. ఇదే నిజమైతే మీనాక్షి కెరీర్‌లో ఫుల్ బిజీగా మారుతుందని సినీ పండితులు పేర్కొంటున్నారు.