Mithra Mandali Trailer | నవ్విస్తున్న ‘మిత్ర మండలి’ట్రైలర్

నిహారిక ఎన్‌ఎమ్‌, ప్రియదర్శి ప్రధానపాత్రల్లో నటించిన 'మిత్ర మండలి' సినిమా ట్రైలర్ విడుదలైంది. విజయేందర్‌ దర్శకత్వంలో రూపొందిన ఈ కామెడీ ఎంటర్‌టైనర్ అక్టోబర్ 16న రిలీజ్ కానుంది.

Mithra Mandali Trailer | నవ్విస్తున్న ‘మిత్ర మండలి’ట్రైలర్

విధాత : నిహారిక ఎన్‌ఎమ్‌, ప్రియదర్శి ప్రధానపాత్రల్లో నటిస్తోన్న చిత్రం ‘మిత్ర మండలి’ సినిమా ట్రైలర్ ను మేకర్స్ విడుదల చేశారు. విజయేందర్‌ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ కామెడీ ఎంటర్ టైనర్ సినిమా అక్టోబర్‌ 16న ప్రేక్షకుల ముందుకు రానుంది. సినిమా ప్రమోషన్ లో భాగంగా తాజాగా విడుదల చేసిన ట్రైలర్ సినిమా కథనం తగ్గట్లుగానే హాస్యభరితంగా ఆధ్యతం నవ్విస్తూ సాగింది.

సత్య, వెన్నెల కిషోర్, ప్రియదర్శి, రాగ్ మయూర్, విష్ణు ఓయ్, , ప్రసాద్ బెహరా సహా నటినటుల హాస్య సన్నివేశాలు హాయిగా నవ్వుకునే రీతిలో సాగి..సినిమాపై అంచనాలు పెంచేశాయి. దీపావళికి థియేటర్ కు వెళ్లి రెండున్నర గంటల పాటు హాయిగా నవ్వుకోవాలనుకునే ప్రేక్షకులకు మిత్రమండలి మంచి ఎంటర్ టైనర్ గా ఉండబోతుందని మేకర్స్ చెబుతున్నారు. ఈ సినిమాకి ఆర్‌ఆర్ ధ్రువన్ సంగీతం అందిస్తున్నారు.