Naga Babu| మీడియా రంగంలోకి నాగ‌బాబు..జ‌న‌సేన పార్టీ కోస‌మా?

Naga Babu| మెగా బ్ర‌ద‌ర్ నాగ‌బాబు న‌టుడిగా, నిర్మాతగా, జ‌డ్జిగా స‌త్తా చాటడం మ‌నం చూశాం. అయితే కొన్నాళ్లుగా ప‌వ‌న్‌తో క‌లిసి రాజ‌కీయాల‌లో ఉంటున్నారు. జ‌న‌సేన కోసం చాలా క‌ష్ట‌ప‌డ్డారు. అయితే ఇప్పుడు ఆయ‌న‌కి ప్ర‌భుత్వంలో కీల‌క ప‌ద‌వి ఇవ్వ‌నున్నార‌ని అంటున్నారు. ప్ర‌స్తుతం నాగబాబు పిఠాపురం నియోజకవర్గం చూసుకుంటూ పవన్ కి సహకారంగా ఉంటూ వస్తున్నారు. అలాంటి ఆయనకు తమ్ముడు పవన్ పదవి ఇవ్వాలని చూస్తున్నారుట. అదే ఫిలిం

  • By: sn    cinema    Aug 10, 2024 1:11 PM IST
Naga Babu| మీడియా రంగంలోకి నాగ‌బాబు..జ‌న‌సేన పార్టీ కోస‌మా?

Naga Babu| మెగా బ్ర‌ద‌ర్ నాగ‌బాబు న‌టుడిగా, నిర్మాతగా, జ‌డ్జిగా స‌త్తా చాటడం మ‌నం చూశాం. అయితే కొన్నాళ్లుగా ప‌వ‌న్‌తో క‌లిసి రాజ‌కీయాల‌లో ఉంటున్నారు. జ‌న‌సేన కోసం చాలా క‌ష్ట‌ప‌డ్డారు. అయితే ఇప్పుడు ఆయ‌న‌కి ప్ర‌భుత్వంలో కీల‌క ప‌ద‌వి ఇవ్వ‌నున్నార‌ని అంటున్నారు. ప్ర‌స్తుతం నాగబాబు (Naga Babu) పిఠాపురం నియోజకవర్గం (Pithapuram constituency) చూసుకుంటూ పవన్ కి సహకారంగా ఉంటూ వస్తున్నారు. అలాంటి ఆయనకు తమ్ముడు పవన్ పదవి ఇవ్వాలని చూస్తున్నారుట. అదే ఫిలిం డెవలెప్‌మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ (Film Development Corporation) పదవి అని అంటున్నారు. కేబినెట్ ర్యాంక్ తో కూడిన ఈ పదవి సీనియర్ నటుడుగా కూడా ఉన్న నాగబాబుకు ఇవ్వడం న్యాయం అని అంటున్నారు.

సినీ పరిశ్రమకు ఇటు ఏపీ ప్రభుత్వానికి (AP government) మధ్య వారధిగా ఆయ‌న ఉండ‌నున్నార‌ని తెలుస్తుంది. ఇక ఇదిలా ఉంటే నాగ‌బాబు మీడియా రంగంలోకి కూడా రాబోతున్న‌ట్టు స‌మాచారం. N మీడియా అంటూ నాగబాబు మీడియా రంగంలోకి వస్తున్నాను అని ప్రకటించారు. N మీడియా (N Media) లోగో రివీల్ చేస్తూ ఓ వీడియోని రిలీజ్ చేసి ఆశ్చ‌ర్య‌ప‌రిచారు. త‌న యూట్యూబ్ ఛానల్ కి N మీడియా ఎంటర్టైన్మెంట్స్ అని పేరు మార్చి సరికొత్తగా ప్రారంభించారు. ప్రస్తుతానికి N మీడియా కేవలం ఎంటర్టైన్మెంట్ న్యూస్ తో పాటు భక్తి న్యూస్, హెల్త్ న్యూస్, పలు ఇంటర్వ్యూలతో ప్రేక్ష‌కుల‌ని అల‌రించ‌నుంది.

ఇక భవిష్యత్తులో పొలిటికల్ న్యూస్ తో పాటు ఒక వెబ్ సైట్ కూడా స్థాపించే అవకాశం ఉందని తెలుస్తుంది. ఇప్పుడు ప్రారంభ‌మైన N మీడియా వచ్చే ఎన్నికల వరకు జనసేనకు (Jana Sena) సపోర్ట్ గా ఉంటుంద‌ని తెలుస్తుంది. రానున్న రోజుల‌లో శాటిలైట్ ఛానెల్ కూడా పెడ‌తారా, దాని ద్వారా జ‌న‌సేన‌కి మ‌రింత ప్ర‌చారం క‌ల్పిస్తారా అని ముచ్చ‌టించుకుంటున్నారు. ఏది ఏమైన జనసేన గెలుపు తర్వాత నాగబాబు సరికొత్తగా ప్లాన్స్ చేస్తూ వార్త‌ల‌లో నిలుస్తున్నారు.