Kotha Lokah : ‘కొత్త లోకా’ తో మళ్లీ నాగవంశీ కమ్ బ్యాక్!
నాగవంశీ ‘కొత్త లోకా’తో మళ్లీ డిస్ట్రిబ్యూటర్‌గా సక్సెస్ బాటలోకి వచ్చాడు, తెలుగు ప్రేక్షకుల నుండి పాజిటివ్ ఫీడ్‌బ్యాక్ దక్కింది.

Kotha Lokah | విధాత: నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ గా తెలుగుతో పాటు పలు భాషల సూపర్ హిట్ సినిమాలను అందించిన నాగవంశీ(Naga Vamshi) ఇటీవల వార్ 2తో ఎదురుదెబ్బ తినడం..మాస్ జాతర(Mass Jatara) మూవీ వాయిదా పడటంతో సోషల్ మీడియాలో ట్రోలింగ్ కు గురయ్యాడు. అయితే నేను మళ్లీ బలంగా తిరుగొస్తానంటూ చెప్పిన కొద్ది రోజులకే మళయాల సినిమా ‘కొత్త లోకా’(Kotha Lokah) తో మళ్లీ సక్సెస్ బాట పట్టాడు. ‘లోకా చాప్టర్ 1 చంద్ర’ అనే టైటిల్ డోమినిక్ అరుణ్ డైరెక్ట్ చేసిన సినిమాను తెలుగులో ‘కొత్త లోకా’ అనే టైటిల్ తో సితార బ్యానర్ అధినేత నాగవంశీ విడుదల చేశాడు.
ఈ సినిమాకు అన్ని భాషల నుంచి పాజిటీవ్ రివ్యూస్ రావడంతో పాటు తెలుగులో కూడా హిట్ టాక్ తెచ్చుకుంటుంది. ఇక ఈ మూవీతో నాగవంశీ డిస్ట్రిబ్యూటర్ గా మళ్లీ ఫామ్ లోకి వచ్చేసినట్టే అని చెప్పుకుంటున్నారు. ‘కొత్త లోకా’ మూవీలో కళ్యాణి ప్రియదర్శి(Kalyani Priyadarshan) మెయిన్ లీడ్ లో.. నాస్లేన్, శాండీ, అరుణ్ కురియన్, విజయరాఘవన్ తదితరులు ఇతర కీలక పాత్రల్లో నటించారు. జేక్స్ బెజోయ్(Jakes Bejoy’s) మ్యూజిక్ అందించారు. సూపర్ ఉమెన్ స్టోరీగా అద్భుతమైన కథ, కథనాలతో రూపొందిన ఈ మూవీ నాగవంశీని తిరిగి సక్సెస్ బాట పట్టించేనంటున్నారు సినీ విశ్లేషకులు.