చూసినోళ్లకు చూసినన్ని.. ఓటీటీలో సినిమాలే సినిమాలు

విధాత : టీవీ ప్రేక్షకులకు రానున్న వారం రోజుల్లో పండగే పండుగ కానుంది. చూసినోళ్లకు చూసినన్ని సినిమాలు ఓటీటీ వేదికగా రానుండగా.. ఈపాటికే కొన్ని సినిమాలు రిలీజై వీక్షకులను అలరిస్తున్నాయి. ప్రస్తుతం ఓటీటీలో అలరిస్తున్న వి, రానున్న సినిమాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి. Netfiix : శర్వానంద్, సిద్దార్థ్ మ‌ల్టీస్టార్ కాంబినేష‌న్తో తెర‌కెక్కిన మ‌హా స‌ముద్రం నేటి నుంచి (14 ఆదివారం) నుంచి నెట్ ఫ్లిక్స్ లో ప్ర‌సారం అవుతుంది. శివ కార్తీకేయ‌న్ హీరోగా న‌టించిన […]

చూసినోళ్లకు చూసినన్ని.. ఓటీటీలో సినిమాలే సినిమాలు

విధాత : టీవీ ప్రేక్షకులకు రానున్న వారం రోజుల్లో పండగే పండుగ కానుంది. చూసినోళ్లకు చూసినన్ని సినిమాలు ఓటీటీ వేదికగా రానుండగా.. ఈపాటికే కొన్ని సినిమాలు రిలీజై వీక్షకులను అలరిస్తున్నాయి. ప్రస్తుతం ఓటీటీలో అలరిస్తున్న వి, రానున్న సినిమాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి.

Netfiix : శర్వానంద్, సిద్దార్థ్ మ‌ల్టీస్టార్ కాంబినేష‌న్తో తెర‌కెక్కిన మ‌హా స‌ముద్రం నేటి నుంచి (14 ఆదివారం) నుంచి నెట్ ఫ్లిక్స్ లో ప్ర‌సారం అవుతుంది. శివ కార్తీకేయ‌న్ హీరోగా న‌టించిన వ‌రుణ్ డాక్ట‌ర్ చిత్రం గత వారం నుంచి నెట్ ఫ్లిక్స్, సన్ నెక్స్ట్ లలో నుంచి ప్రసారమవుతూ ఉంది.

Aha: అఖిల్ న‌టించిన మోస్ట్ ఎలిజిబిల్ బ్యాచిల‌ర్ ఈ నెల 19 నుంచి ఆహాలో ప్రసారం కానుంది.

Amazon : వెంక‌టేష్, మీనా న‌టించిన దృశ్యం2 ఈ నెల 25 నుంచి అమెజాన్ ప్రైమ్ లో ప్ర‌సారం కానుండగా గోపిచంద్ హీరోగా వచ్చిన ఆరడుగుల బుల్లెట్ అల్రేడీ విడుదలైంది.

Hotstar: షాంగ్ చీ, జంగ‌ల్ కృశ్, హోమ్ ఎలోన్ (రిమేక్) హాలీవుడ్ తెలుగు డబ్బింగ్ సినిమాలు డిస్నీ హాట్ స్టార్లో అల్రేడీ ప్ర‌సారం అవుతున్నాయి.

ZEE5 : శ్రీ విష్ణు హీరోగా తెర‌కెక్కిన రాజ రాజ చోర, సుధీర్‌బాబు నటించిన శ్రీదేవి సోడా సెంటర్‌ జీ5లో ప్ర‌సారం అవుతున్నాయి. ఇలా రానున్న రోజులన్నీ వీక్షకులకు ఇంట్లోనే వినోదాన్ని అందించనున్నాయి. ఇంకేందుకు ఆలస్యం సమయం ఉంటె మీరు చూసేయండి మరి.