Mega vs Allu|ఆ రోజు కోసం అందరు ఎదురు చూపులు.. ఒకే వేదికపైకి పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్
Mega vs Allu| గత కొద్ది రోజులుగా అల్లు, మెగా కోల్డ్ వార్ గురించి నెట్టింట జోరుగా చర్చ నడుస్తున్న విషయం తెలిసిందే. చెప్పను బ్రదర్ అనే డైలాగ్‌తో మెగా ఫ్యాన్స్ ఆగ్రహం కట్టలు తెగేలా చేసిన అల్లు అర్జున్ మొన్న ఏపీ సార్వత్రిక ఎన్నికల సమయంలో అల్లు అర్జున్ వైసీపీ అభ్యర్థికి మద్దతు తెలపి పెద్ద తప్పిదమే చేశాడు.. అల్లు అర్జున్ తీరు పవన్ కళ్యాణ్ కి నచ్చలేదు. నాగబాబు, సాయి ధరమ్ తేజ్ సోషల్ మీడియా వేదికగా తమ అసహనం ప్రక

Mega vs Allu| గత కొద్ది రోజులుగా అల్లు, మెగా కోల్డ్ వార్ గురించి నెట్టింట జోరుగా చర్చ నడుస్తున్న విషయం తెలిసిందే. చెప్పను బ్రదర్ అనే డైలాగ్‌తో మెగా ఫ్యాన్స్ ఆగ్రహం కట్టలు తెగేలా చేసిన అల్లు అర్జున్ మొన్న ఏపీ సార్వత్రిక ఎన్నికల సమయంలో అల్లు అర్జున్ వైసీపీ అభ్యర్థికి మద్దతు తెలపి పెద్ద తప్పిదమే చేశాడు.. అల్లు అర్జున్ తీరు పవన్ కళ్యాణ్ కి నచ్చలేదు. నాగబాబు, సాయి ధరమ్ తేజ్ సోషల్ మీడియా వేదికగా తమ అసహనం ప్రకటించారు. పవన్ కళ్యాణ్ సైతం పవన్ కళ్యాణ్ సైతం అల్లు అర్జున్ టార్గెట్ గా విమర్శలు గుప్పించారు. పుష్ప సినిమాను ఉద్దేశిస్తూ.. గతంలో హీరోలు అడవులను అభివృద్ధి చేసే పాత్రలు చేసేవారు. కానీ ఇప్పటి హీరోలు అడవులను నరికి స్మగ్లింగ్ చేసే పాత్రలు చేస్తున్నారు. సినిమా వాడిగా అలాంటి పాత్రలు చేయడం నాకు ఇష్టం ఉండదు అన్నాడు.
ఇక దీనికి కౌంటర్‌గా అల్ల అర్జున్ ఇటీవల ఓ ఈవెంట్‌లో.. తనకు నచ్చితే, ఇష్టమైతే వస్తాను, ఎక్కడికైనా వెళతాను అని… అల్లు అర్జున్ మెగా ఫ్యామిలీకి కౌంటర్ ఇచ్చాడు. దీంతో అల్లు, మెగా ఫ్యామిలీ మధ్య కోల్డ్ వార్ నడుస్తుందని చాలా మంది కన్‌ఫాం అయ్యారు. అయితే నటసింహం నందమూరి బాలకృష్ణ సినీ రంగ ప్రవేశం చేసి 50 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా సెప్టెంబర్ 1న హైదరాబాద్ హైటెక్స్ నోవోటెల్ హోటల్లో తెలుగు సినీ పరిశ్రమ ఆధ్వర్యంలో గ్రాండ్ గా సెలబ్రేషన్స్ ని ప్లాన్ చేశారు. బాలకృష్ణ పద్నాలుగేళ్ళ వయసులో తండ్రి ఎన్. టి. ఆర్ దర్శకత్వం వహించిన తాతమ్మకల సినిమాతో ఎంట్రీ ఇచ్చారు. 50 వసంతాలు సెలబ్రేషన్స్ కు ఇతరభాషలకు సంబందించిన స్టార్స్ ను ఆహ్వానించారు. తెలుగు సినీ పరిశ్రమ ఆధ్వర్యంలో జరుగుతోన్న ఈ వేడుకకు చాలా మంది ప్రముఖులు హాజరై సందడి చేయనున్నారు.
చిరంజీవి, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌తో పాటు పలువురు ప్రముఖులు హాజరు కానున్నారు. ఇక అల్లు అర్జున్‌కి కూడా రీసెంట్‌గా ఇన్విటేషన్ అందింది.బాలకృష్ణతో కూడా బన్నీకి మంచి అనుబంధం ఉంది కాబట్టి ఆయన కూడా వచ్చే అవకాశం ఉంది. మరి ఈ వేదిక నుండి అల్లు, మెగా ఫ్యామిలీ ఎలాంటి ట్విస్ట్ ఇస్తారా అని ప్రతి ఒక్కరు ఎంతో ఆసక్తిగా గమనిస్తున్నారు.