‘భవదీయుడు భగత్ సింగ్’ గా పవర్ స్టార్

విధాత:పవర్‌స్టార్‌ పవన్ కల్యాణ్,హరీశ్ శంకర్ కాంబినేషన్‌లో ఓ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. మోస్ట్‌ అవైటెడ్‌ ప్రాజెక్ట్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాకు సంబంధించి తాజాగా ఫస్ట్‌లుక్‌తో పాటు టైటిల్‌ను రివీల్‌ చేశారు మేకర్స్‌. నిన్నటి నుంచే అప్‌డేట్‌ ఇస్తామంటూ ఊరించిన చిత్ర బృందం ఫైనల్‌గా ఈ చిత్రానికి 'భవదీయుడు భగత్ సింగ్' అనే టైటిల్‌ను ఖారారు చేశారు. పోస్ట్‌ర్‌ లుక్‌లో పవన్‌ బైక్‌పై కూర్చొని ఓ చేతిలో మైక్‌, మరో చేతిలో టీ గ్లాస్‌తో కనిపించారు. పవన్‌-హరీశ్‌ […]

‘భవదీయుడు భగత్ సింగ్’ గా పవర్ స్టార్

విధాత:పవర్‌స్టార్‌ పవన్ కల్యాణ్,హరీశ్ శంకర్ కాంబినేషన్‌లో ఓ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. మోస్ట్‌ అవైటెడ్‌ ప్రాజెక్ట్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాకు సంబంధించి తాజాగా ఫస్ట్‌లుక్‌తో పాటు టైటిల్‌ను రివీల్‌ చేశారు మేకర్స్‌. నిన్నటి నుంచే అప్‌డేట్‌ ఇస్తామంటూ ఊరించిన చిత్ర బృందం ఫైనల్‌గా ఈ చిత్రానికి ‘భవదీయుడు భగత్ సింగ్’ అనే టైటిల్‌ను ఖారారు చేశారు.

పోస్ట్‌ర్‌ లుక్‌లో పవన్‌ బైక్‌పై కూర్చొని ఓ చేతిలో మైక్‌, మరో చేతిలో టీ గ్లాస్‌తో కనిపించారు. పవన్‌-హరీశ్‌ శంకర్‌ మూవీ కావడంతో ఇప్పటికే ఈ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. మైత్రీ మూవీ మేకర్స్‌ నిర్మిస్తున్న ఈ సినిమాలో పవన్‌కు జోడీగా పూజా హెగ్డే నటించనున్నట్లు టాక్‌ వినిపిస్తుంది. దేవిశ్రీ ప్రసాద్‌ ఈ సినిమాకు సంగీతం అందించనున్నారు.