Puneeth Raj Kumar|కొంప‌ముంచిన కోవిషీల్డ్.. పునీత్ రాజ్ కుమార్ కూడా దాని వ‌ల్లే మ‌ర‌ణించాడా..!

Puneeth Raj Kumar| కరోనా మ‌హ‌మ్మారి విల‌య‌తాండవం చేసిన స‌మ‌యంలో భారత్ లో కొవాక్సిన్, కొవిషీల్డ్ టీకాలు పంపిణీ చేసిన విష‌యం తెలిసిందే. కేంద్ర ప్రభుత్వం నేరుగా కొవాక్సిన్, కొవిషీల్డ్ సేకరించి ప్రజలకు ఉచితంగా అందించింది. ఈ నేప‌థ్యంలో దేశవ్యాప్తంగా సుమారు 85 శాతం మంది కొవాక్సిన్ లేదా కొవీషీల్డ్ తీసు

  • By: sn    cinema    May 01, 2024 8:54 PM IST
Puneeth Raj Kumar|కొంప‌ముంచిన కోవిషీల్డ్.. పునీత్ రాజ్ కుమార్ కూడా దాని వ‌ల్లే మ‌ర‌ణించాడా..!

Puneeth Raj Kumar| కరోనా మ‌హ‌మ్మారి విల‌య‌తాండవం చేసిన స‌మ‌యంలో భారత్ లో కొవాక్సిన్, కొవిషీల్డ్ టీకాలు పంపిణీ చేసిన విష‌యం తెలిసిందే. కేంద్ర ప్రభుత్వం నేరుగా కొవాక్సిన్, కొవిషీల్డ్ సేకరించి ప్రజలకు ఉచితంగా అందించింది. ఈ నేప‌థ్యంలో దేశవ్యాప్తంగా సుమారు 85 శాతం మంది కొవాక్సిన్ లేదా కొవీషీల్డ్ తీసుకున్నారు.అయితే తాజాగా కోవీషీల్డ్ గుండెలు ప‌గిలే వార్త ఒక‌టి బ‌య‌ట‌కు వ‌చ్చింది. తాము తయారుచేసిన కొవీషీల్డ్ వ్యాక్సిన్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయంటూ ఆస్ట్రాజెనికా కంపెనీ ప్ర‌క‌టించ‌డం జ‌రిగింది. అంతేకాదు ఈ వ్యాక్సిన్ తీసుకున్న‌వారిలో కొంద‌రికి రక్తం గ‌డ్డ‌క‌డుతుంద‌ని, ఇంకొంద‌రికి ప్లేట్‌లెట్స్ సంఖ్య త‌గ్గుతుంద‌ని చెప్పుకొచ్చింది.

ఇది విన్న‌వారు, కోవీషీల్డ్ వేసుకున్న‌వారి వెన్నులో వ‌ణుకు ప‌డుతుంది. ఎంతమందిపై ఈ దుష్ప్రభావం చూపుతంది అనే దానిపై చ‌ర్చ న‌డుస్తుంది. ఇదే క్ర‌మంలో క‌న్న‌డ సూప‌ర్ స్టార్ పునీత్ రాజ్‌కుమార్ కూడా కోవీషీల్డ్ వ‌ల‌నే మ‌ర‌ణించారంటూ ఆయ‌న అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. పునీత్ రాజ్ కుమార్ 2021 అక్టోబర్ 29న గుండెపోటుతో మరణించారు. ఉదయం వ్యాయామం చేస్తున్నసమయంలో అత‌ని ఛాతిలో నొప్పి రావ‌డంతో ఆసుప‌త్రికి వెళ్లేందుకు కారు వ‌ద్దకు న‌డుచుకుంటూ వ‌చ్చాడు. కారులో ఆసుప‌త్రికి వెళుతున్న స‌మ‌యంలో ఆయ‌న క‌న్నుమూసారు. 46 ఏళ్ళ పునీత్ రాజ్ కుమార్ ఆరోగ్యం విషయంలో ఎన్నో జాగ్ర‌త్త‌లు తీసుకున్నా కూడా అంత చిన్న వ‌య‌స్సులో మ‌ర‌ణించ‌డం సంచ‌ల‌నంగా మారింది.

అయితే ఇప్పుడు పునీత్ చనిపోవ‌డానికి కోవీషీల్డ్ కార‌ణ‌మ‌నే వాద‌న మొద‌లైంది. పునీత్ రాజ్ కుమార్ కోవీషీల్డ్ వ్యాక్సిన్ వేయించుకున్నారని, అందుకే గుండె పోటు వచ్చిందని నెటిజన్స్ అంటున్నారు. పునీత్ రాజ్ కుమార్ 2021లో వ్యాక్సిన్ వేయించుకుంటున్న ఫోటో ఇంస్టాగ్రామ్ లో షేర్ చేశాడు. దానికి కామెంట్‌గా మీ వ‌య‌స్సు 45 ఏళ్లకు పైబడిన వారైతే తప్పక కోవిడ్ వ్యాక్సిన్ వేయించుకోండని కామెంట్ పెట్టారు. సదరు పోస్ట్ క్రింద ఓ నెటిజన్.. సర్ మీరు కోవీషీల్డ్ తీసుకోవద్దు. 45 ఏళ్ళు పైబడిన వారికి అది మంచిది కాదంటూ ఓ నెటిజ‌న్ కామెంట్ పెట్టారు . ఇప్పుడు ఆ పోస్ట్ నెట్టింట వైర‌ల్‌గా మారింది. కోవీషీల్డ్ ప్రమాదం అని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో పునీత్ దాని వ‌ల‌నే మ‌ర‌ణించాడ‌ని కొంద‌రు గ‌ట్టిగా చెబుతున్నారు