Ram charan|ఏంద‌య్యా రామ్ చ‌ర‌ణ్ ఇది.. ఒక్క‌సారే 30 కోట్లు పెంచేశావ్..!

Ram charan| ఇటు హీరోయిన్స్, అటు హీరోల క్రేజ్ కాస్త పెరిగిందంటే చాలు రెమ్యున‌రేష‌న్ అమాంతం పెంచేసి నిర్మాత‌ల‌కి షాక్ ఇస్తుంటారు. ఇప్పుడు మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ ఏకంగా 30 కోట్లు రెమ్యున‌రేష‌న్ అమాంతం పెంచిన‌ట్టు ప్ర‌చారం జ‌ర‌గుతుంది. గేమ్ ఛేంజర్ చిత్రం కన్నా 30 కోట్లు ఎక్కువ

  • By: sn    cinema    Apr 28, 2024 7:04 PM IST
Ram charan|ఏంద‌య్యా రామ్ చ‌ర‌ణ్ ఇది.. ఒక్క‌సారే 30 కోట్లు పెంచేశావ్..!

Ram charan| ఇటు హీరోయిన్స్, అటు హీరోల క్రేజ్ కాస్త పెరిగిందంటే చాలు రెమ్యున‌రేష‌న్ అమాంతం పెంచేసి నిర్మాత‌ల‌కి షాక్ ఇస్తుంటారు. ఇప్పుడు మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ ఏకంగా 30 కోట్లు రెమ్యున‌రేష‌న్ అమాంతం పెంచిన‌ట్టు ప్ర‌చారం జ‌ర‌గుతుంది. గేమ్ ఛేంజర్ చిత్రం కన్నా 30 కోట్లు ఎక్కువ రెమ్యేన‌రేష‌న్‌ని రామ్ చ‌ర‌ణ్ డిమాండ్ చేశాడ‌ని, అందుకు నిర్మాత‌లు ఇచ్చేందుకు కూడా సిద్ధ‌మ‌య్యార‌ని టాక్. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ సినిమాతో రామ్ చ‌ర‌ణ్ క్రేజ్ విప‌రీతంగా పెరిగింది. ఈ సినిమాతో గ్లోబ‌ల్ స్టార్ బిరుదు కూడా ద‌క్కంచుకున్నాడు. ఇక ఆర్ఆర్ఆర్ త‌ర్వాత రామ్ చ‌ర‌ణ్ అనేక ప్రతిష్టాత్మక అవార్డు కార్యక్రామాలకు చీఫ్‌ గెస్ట్‌గా హాజరై సంద‌డి చేశాడు.

రీసెంట్ గా వేల్స్‌ యూనివర్సిటీ నుంచి గౌరవ డాక్టరేట్ అందుకోవ‌డం మ‌నం చూశాం. అయితే రామ్ చ‌ర‌ణ్ ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమాకు ముందు రూ.30 నుంచి రూ.40 కోట్లు రెమ్యునరేష‌న్ తీసుకునేవాడ‌ట‌. అయితే ఆర్ఆర్ఆర్ మూవీకి మాత్రం ఏకంగా రూ. 95 కోట్ల నుంచి రూ. 100 కోట్లు తీసుకుంటున్నాడని తెలుస్తోంది. ఇక రామ్ చ‌ర‌ణ్ చేతిలో ప్ర‌స్తుతం గేమ్ ఛేంజ‌ర్ అనే మూవీ ఉండ‌గా, ఈ సినిమా త‌ర్వాత త‌న 16వ సినిమా చేయ‌నున్నాడు చెర్రీ. అయితే ఈ సినిమా కోసం రామ్ చ‌ర‌ణ్ త‌న రెమ్యున‌రేష‌న్‌ని ఏకంగా రూ.30 కోట్ల‌కి పెంచాడ‌ని స‌మాచారం. అంటే బుచ్చిబాబుతో చేస్తున్న సినిమాకు రూ. 125 కోట్ల నుంచి రూ. 130 కోట్ల వరకు తీసుకుంటున్నట్టు తెలుస్తుంది.

మైత్రి మూవీ మేక‌ర్స్ వారే రామ్ చ‌ర‌ణ్‌కి ఆ రేంజ్ రెమ్యున‌రేష‌న్ డిమాండ్ చేసిన‌ట్టు తెలుస్తుంది. ఇదే నిజ‌మైతే మాత్రం ప్రభాస్‌ తర్వాత తెలుగులో అత్యధిక రెమ్యునరేషన్‌ తీసుకునే హీరోల్లో చరణ్ ఒకరిగా నిలుస్తారు. ఇక బుచ్చిబాబు- రామ్ చ‌ర‌ణ్ సినిమా కోసం పెద్ది అనే టైటిల్‌ని ఫిక్స్ చేసిన‌ట్టు తెలుస్తుంది. ఇందులో జాన్వీ కపూర్‌ హీరోయిన్‌గా కనిపించనుంది. సంజయ్‌దత్‌ విలన్ గా కనిపించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఉత్తరాంధ్ర బ్యాక్‌డ్రాప్ లో స్పోర్ట్స్ డ్రామాగా సినిమా తెరకెక్కించనున్నారు. ఇందులో చ‌ర‌ణ్ ఉత్తరాంధ్రకు చెందిన స్పోర్ట్స్ పర్శన్ గా కనిపించనున్నారు.