Roja| జ‌బ‌ర్ధ‌స్త్ క‌మెడీయ‌న్స్ రోజా కాళ్ల మీద ప‌డ్డారా.. రాకింగ్ రాకేష్ సంచ‌ల‌న కామెంట్స్

Roja|  ఏపీ ఎన్నిక‌ల త‌ర్వాత రోజాని ఓ రేంజ్‌లో ఆడుకుంటుండ‌డం మ‌నం చూశాం. ముఖ్యంగా ప‌వ‌న్ క‌ళ్యాణ్ విష‌యంలో ఆమె చేసిన కామెంట్స్‌కి ఇప్పుడు తిరిగి కౌంట‌ర్స్ ఇస్తున్నారు. జ‌బ‌ర్ధ‌స్త్ జ‌డ్జిగా ఎంతో మందిని అల‌రించిన రోజా ఎనిమిదేళ్లకి పైగా ఆ షోలో ఉన్నారు. ఇక మంత్రి అయ్యాక ఆషోకి గుడ్ బై చె

  • By: sn    cinema    Jun 27, 2024 6:46 AM IST
Roja| జ‌బ‌ర్ధ‌స్త్ క‌మెడీయ‌న్స్ రోజా కాళ్ల మీద ప‌డ్డారా.. రాకింగ్ రాకేష్ సంచ‌ల‌న కామెంట్స్

Roja|  ఏపీ ఎన్నిక‌ల త‌ర్వాత రోజాని ఓ రేంజ్‌లో ఆడుకుంటుండ‌డం మ‌నం చూశాం. ముఖ్యంగా ప‌వ‌న్ క‌ళ్యాణ్ విష‌యంలో ఆమె చేసిన కామెంట్స్‌కి ఇప్పుడు తిరిగి కౌంట‌ర్స్ ఇస్తున్నారు. జ‌బ‌ర్ధ‌స్త్ జ‌డ్జిగా ఎంతో మందిని అల‌రించిన రోజా ఎనిమిదేళ్లకి పైగా ఆ షోలో ఉన్నారు. ఇక మంత్రి అయ్యాక ఆషోకి గుడ్ బై చెప్పారు. అయితే ఆ జర్నీలో చాలా మంది క‌మెడీయ‌న్స్‌తో రోజాకి మంచి బాండింగ్ ఏర్ప‌డింది. కొంద‌రికి అత్య‌వ‌స‌ర స‌మ‌యంలో రోజా సాయం కూడా చేశార‌నే టాక్ ఉంది. అయితే రోజాని అప్ప‌ట్లో ఎంతో అభిమానిస్తూ గౌర‌వించే వాళ్లు ఎన్నిక‌ల స‌మ‌యంలో ఆమెని దారుణంగా విమ‌ర్శించ‌డం మ‌నం చూశాం.

ముఖ్యంగా సుడిగాలి సుధీర్, రామ్ ప్రసాద్, గెటప్ శ్రీను, హైపర్ ఆది జనసేన పార్టీ తరపున ప్రచారం చేస్తూ రోజాపై కూడా కొంత విమ‌ర్శ‌లు గుప్పించారు. ఇక కిరాక్ ఆర్పీ అయితే రోజాని ఓ రేంజ్‌లో ఆడుకున్నారు. ఆమెని దారుణంగా విమ‌ర్శించారు. ఈ క్ర‌మంలో మ‌రో జ‌బ‌ర్ధ‌స్త్ క‌మెడీయ‌న్ రాకింగ్ రాకేష్ తాజా ఇంట‌ర్వ్యూలో రోజాని విమ‌ర్శించేవారిపై త‌న‌దైన శైలిలో కామెంట్ చేశాడు. రోజా నాకు అమ్మతో సమానం. అమ్మ‌ మీద అభిమానంతో నగరికి వెళ్లి ఆమె త‌ర‌పున ప్ర‌చారం చేశాను. నాది ఉడతా భక్తి లాంటిది. నేను ఇబ్బందులో ఉన్నప్పుడు ధైర్యం చెప్పి నాకు అండ‌గా నిలిచారు. నాతో పాటు చాలా మంది కూడా ఆమె నుండి సాయం పొందారు.

నా చేతుల ద్వారా కూడా ఆమె ఎంతో మందికి సాయం చేశారో నాకు తెలుసు. ప‌రుగున వెళ్లి ఆమె కాళ్ళ మీద పడితే వెంటనే సహాయం చేసేవారు. ఆమె ఆస్తులు అమ్మి కూడా సహాయం చేసిన సంద‌ర్బాలు ఉన్నాయి. రోజాది అలాంటి మంచి వ్య‌క్తిత్వం. ఇక విమ‌ర్శించిన వాళ్లంటే వాళ్ల వ్య‌క్తిత్వానికే వ‌దిలేద్దాం. ఏరు దాటాక తెప్ప తగలేసే రకం వాళ్ళు. రాజకీయాలు, పదవులు ఎప్ప‌టికీ శాశ్వతం కాదు. వ్యక్తులే ముఖ్యం.. అని రాకింగ్ రాకేష్ ఎమోషనల్ కామెంట్స్ చేశాడు. ప్ర‌స్తుతం ఆయ‌న వ్యాఖ్య‌ల‌పై నెట్టింట వైర‌ల్ అవుతుండ‌గా, ఆయ‌న వ్యాఖ్య‌ల‌పై ఎవ‌రైన స్పందిస్తారా అనేది చూడాల్సి ఉంది. ఇక ఇదిలా ఉంటే రాకింగ్ రాకేష్, సుజాత‌ వివాహం రోజా దగ్గరుండి తిరుమలలో చేసిన విష‌యం తెలిసిందే.