సాయి ప‌ల్ల‌వి లుక్ అదిరిపోలా..

కేర‌ళ కుట్టి సాయి ప‌ల్ల‌వి టాలీవుడ్ ఇండ‌స్ట్రీలో వ‌రుస ఆఫ‌ర్స్‌తో ఫుల్ బిజీగా ఉంది. సాయి ప‌ల్ల‌వి న‌టించిన ల‌వ్ స్టోరీ, విరాట ప‌ర్వం చిత్రాలు ఇప్ప‌టికే విడుద‌ల కావ‌ల‌సి ఉన్న క‌రోనా వ‌ల‌న వాయిదా ప‌డ్డాయి. ప్ర‌స్తుతం ‘టాక్సీవాలా’ డైరెక్టర్ రాహుల్ సాంకృత్యాన్ ద‌ర్శ‌క‌త్వంలో శ్యామ్ సింగ రాయ్ అనే చిత్రం చేస్తుంది. నేచుర‌ల్ స్టార్ నాని హీరోగా న‌టిస్తున్న ఈ చిత్రంలో కృతిశెట్టి, మ‌డోన్నా సెబాస్టియ‌న్ ముఖ్య పాత్ర‌లు పోషిస్తుండ‌గా, నిహారిక ఎంట‌ర్‌టైన్‌మెంట్ బ్యాన‌ర్‌పై […]

సాయి ప‌ల్ల‌వి లుక్ అదిరిపోలా..

కేర‌ళ కుట్టి సాయి ప‌ల్ల‌వి టాలీవుడ్ ఇండ‌స్ట్రీలో వ‌రుస ఆఫ‌ర్స్‌తో ఫుల్ బిజీగా ఉంది. సాయి ప‌ల్ల‌వి న‌టించిన ల‌వ్ స్టోరీ, విరాట ప‌ర్వం చిత్రాలు ఇప్ప‌టికే విడుద‌ల కావ‌ల‌సి ఉన్న క‌రోనా వ‌ల‌న వాయిదా ప‌డ్డాయి. ప్ర‌స్తుతం ‘టాక్సీవాలా’ డైరెక్టర్ రాహుల్ సాంకృత్యాన్ ద‌ర్శ‌క‌త్వంలో శ్యామ్ సింగ రాయ్ అనే చిత్రం చేస్తుంది.

నేచుర‌ల్ స్టార్ నాని హీరోగా న‌టిస్తున్న ఈ చిత్రంలో కృతిశెట్టి, మ‌డోన్నా సెబాస్టియ‌న్ ముఖ్య పాత్ర‌లు పోషిస్తుండ‌గా, నిహారిక ఎంట‌ర్‌టైన్‌మెంట్ బ్యాన‌ర్‌పై వెంక‌ట్ ఎస్‌. బోయ‌న‌ప‌ల్లి నిర్మిస్తున్నారు.ఈ చిత్రంలో నాని, సాయి ప‌ల్లవి మేకొవ‌ర్ కొత్త‌గా ఉంటుంది.

కోల్‌క‌తా బ్యాక్‌డ్రాప్‌లో శ్యామ్ సింగ‌రాయ్ చిత్రం తెర‌కెక్కుతుండ‌గా, ఈ చిత్రంలో సాయి ప‌ల్ల‌వి లుక్ విడుద‌ల చేశారు. ఆమె బ‌ర్త్‌డేని పుర‌స్క‌రించుకొని విడుద‌లైన పోస్ట‌ర్ అభిమానుల‌ని ఆక‌ట్టుకుంటుంది. కాళికాదేవి అవ‌త‌రంలో సాయి ప‌ల్ల‌వి ఉగ్ర‌రూపం దాల్చిన‌ట్టుగా ఉంది. ఈ పోస్టర్‌కు ఫ్యాన్స్ నుంచి విపరీతమైన స్పందన వస్తోంది. పోస్టర్ అదిరిపోయిందని కొనియాడుతున్నారు.