Actress| నా భ‌ర్త అనుమ‌తి తీసుకొనే అత‌నికి లిప్ లాక్ ఇచ్చానంటూ షాకింగ్ కామెంట్ చేసిన న‌టి

ప్ర‌స్తుతం సినిమాల రూపు రేఖ‌లు మారాయి. గ‌తంలో ఇంటిల్లిపాది కూర్చొని సినిమాలు చూసేవారు. కాని ఇప్పుడు అలాంటి పరిస్థితులు లేవు. ఏ సినిమా చూడు అందులో ముద్దు సీన్లు, శృంగార స‌న్నివేశాలు వంటివి త‌ప్ప‌నిస‌రిగా ఉంటున్నాయి. సినిమాల‌లో అలాంటి స‌న్నివేశాలు ఉంటుండ‌డంతో థియేట‌ర్స్‌కి వ‌చ్చే వారి సంఖ్య పెరుగుతుంది. ఈ క్ర‌మంలో ద‌ర్శ‌క నిర్మాత‌లు త‌ప్ప‌నిస‌రిగా వారి సినిమాల‌లో ముద్దు సన్నివేశాల‌ని త‌ప్ప‌క పెడుతున్నా

  • By: sn    cinema    Oct 19, 2024 6:12 PM IST
Actress| నా భ‌ర్త అనుమ‌తి తీసుకొనే అత‌నికి లిప్ లాక్ ఇచ్చానంటూ షాకింగ్ కామెంట్ చేసిన న‌టి

ప్ర‌స్తుతం సినిమాల రూపు రేఖ‌లు మారాయి. గ‌తంలో ఇంటిల్లిపాది కూర్చొని సినిమాలు చూసేవారు. కాని ఇప్పుడు అలాంటి పరిస్థితులు లేవు. ఏ సినిమా చూడు అందులో ముద్దు సీన్లు, శృంగార స‌న్నివేశాలు వంటివి త‌ప్ప‌నిస‌రిగా ఉంటున్నాయి. సినిమాల‌లో అలాంటి స‌న్నివేశాలు ఉంటుండ‌డంతో థియేట‌ర్స్‌కి వ‌చ్చే వారి సంఖ్య పెరుగుతుంది. ఈ క్ర‌మంలో ద‌ర్శ‌క నిర్మాత‌లు త‌ప్ప‌నిస‌రిగా వారి సినిమాల‌లో ముద్దు సన్నివేశాల‌ని త‌ప్ప‌క పెడుతున్నారు. అయితే ఒకప్పుడు సినిమాలో ముద్దు సీన్లు ఉంటే వార్త. ఇప్పుడు ఎన్ని ముద్దు సీన్లు ఉంటే అంత పెద్ద వార్త అన్నట్టుగా సినిమా మారిపోయింది.

అప్ప‌ట్లో న‌ట‌న‌టులు ముద్దు స‌న్నివేశాల‌లో న‌టించ‌డానికి చాలా మొహ‌మాట‌ప‌డేవారు. కాని ఇప్పుడు రెమ్యున‌రేష‌న్ ఇస్తే సై అంటున్నారు. పెళ్లి అయిన భామ‌లు కూడా ముద్దు స‌న్నివేశాల‌లో న‌టించ‌డానికి రెడీగా ఉన్నారు. తాజాగా ఓ నటి తన భర్తకు చెప్పే లాప్‌లాక్ సన్నివేశంలో నటించానని చెప్పి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌ర‌చింది. ఆమె మ‌రెవ‌రో కాదు బాలీవుడ్ సీనియర్ నటి షబానా అజ్మీ. గతేడాది రణ్‌వీర్ సింగ్, అలియా భట్‌ హీరో, హీరోయిన్లుగా ‘రాకీ ఔర్ రాణికి ప్రేమ్ కహానీ’ సినిమాలో నటించిన ఈ అమ్మ‌డు త‌న న‌ట‌న‌తో అద‌ర‌గొట్టొంది. అయితే ఈ చిత్రంలో ష‌బానాతో పాటు జయాబచ్చన్, షబానా అజ్మీ, ధర్మేంద్ర వంటి వారు కీలక పాత్రలో కనిపించారు. అయితే ఈ సినిమాలో ధర్మేంద్రతో షబానా అజ్మీ ఘాటైన లిప్‌లాక్ ఇచ్చారు.

సినిమా విడుదల సమయంలో ఈ లిప్‌లాక్ సన్నివేశం గురించి .జోరుగా చ‌ర్చ‌న‌డిచింది. అయితే అప్పుడు దీని గురించి నోరు విప్ప‌ని ష‌భానా తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో క్లారిటీ ఇచ్చింది. కరణ్ జోహార్ నాకు కథ చెప్పినప్పుడే ఈ లిప్‌లాక్ సన్నివేశం గురించి తెలిపారని, అది విన్న తర్వాత నేను నా భర్త అనుమతి తీసుకొని చెబుతానని ఆమె పేర్కొంది. అయితే త‌న భ‌ర్త‌కి ఈ లిప్ గురించి చెబితే, ఓ ఇది చాలా చిన్న విష‌యం.. దీని గురించి నా అనుమ‌తి ఎందుకు అని అన‌డంతో స‌న్నివేశంలో న‌టించాను అంటూ ష‌బానా అజ్మీ చెప్పుకొచ్చారు. ఈ సినిమాలో నేను చేసిన పాత్ర నాకు ఎప్పటికీ గుర్తుండిపోతుందని ఆమె వ్యాఖ్యానించింది. ఆమె కామెంట్స్ ఇప్పుడు నెట్టింట వైర‌ల్ అవుతున్నాయి.