Bigg Boss| బిగ్ బాస్ హౌజ్‌లోకి దూరిన పాము.. అనుకోని అతిథి గుబులు రేపిందిగా..!
Bigg Boss| బిగ్ బాస్ షోకి విపరీతమైన ఆదరణ దక్కింది. అన్ని ప్రాంతీయ భాషలలో కూడా ఈ షో మంచి రేటింగ్‌తో దూసుకుపోతుంది. ఈ క్రమంలో ఓటీటీ షోలు కూడా సందడి చేస్తున్నాయి. ప్రస్తుతం హిందీలో అనీల్ కపూర్ హోస్ట్‌గా బిగ్ బాస్ ఓటీటీ షో రన్ అవుతుంది. ఈ షో కూడా ఆసక్తికరంగానే సాగుతుంది. అయితే బిగ్ బాస్ హౌజ్‌లోకి అప్పుడప్పుడు అతిథులు వచ్చి సందడి చేస్తుండడం మనం చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు ఓటీటీ షోలోకి వచ్చిన గెస్ట్ చాలా ప్ర

Bigg Boss| బిగ్ బాస్ షోకి విపరీతమైన ఆదరణ దక్కింది. అన్ని ప్రాంతీయ భాషలలో కూడా ఈ షో మంచి రేటింగ్‌తో దూసుకుపోతుంది. ఈ క్రమంలో ఓటీటీ షోలు కూడా సందడి చేస్తున్నాయి. ప్రస్తుతం హిందీలో అనీల్ కపూర్ హోస్ట్‌గా బిగ్ బాస్ ఓటీటీ షో రన్ అవుతుంది. ఈ షో కూడా ఆసక్తికరంగానే సాగుతుంది. అయితే బిగ్ బాస్ హౌజ్‌లోకి అప్పుడప్పుడు అతిథులు వచ్చి సందడి చేస్తుండడం మనం చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు ఓటీటీ షోలోకి వచ్చిన గెస్ట్ చాలా ప్రమాదకరం. అదేంటని అనుకుంటున్నారా.. మరేం లేదు బిగ్‌బాస్ హౌస్ లో ప్రేక్షకులు పామును గుర్తించారు. గార్డెన్ ఏరియాలో నేలపై నల్లటి పాము వెళ్తున్న వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ నిర్వాహకులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
గార్డెన్ ఏరియాలో సంచరిస్తున్న పామును కంటెస్టెంట్స్ ఎవరు గుర్తించలేదు. ఎవరి పనిలో వారున్నారు. లైవ్ టెలికాస్ట్ చూస్తున్న ప్రేక్షకులు ఆ పామును గమనించారు. వెంటనే స్క్రీన్ రికార్డింగ్ చేసి సోషల్ మీడియాలో వీడియోను షేర్ చేయడంతో వైరల్‌గా మారింది. దీంతో బిగ్ బాస్ షో కంటెస్టెంట్స్ సేఫ్టీ ప్రశ్నార్థకంగా మారింది. వీడియోలో కంటెస్టెంట్ లవకేష్ కటారియా అకా లవ్ కటారియా సమీపంలోని పాము వెళ్తూ కనిపించింది. అయితే తన పక్కన నుంచి పాము వెళ్తున్నా అతడు చూసుకోకుండా అలాగే నేలపై కూర్చుని ఉన్నాడు. లవ్ కటారియా చేతులను సంకెళ్లతో కట్టేసి ఉండగా.. అతడి పక్కన నుంచే నల్లటి పాము వెళ్లడం బిగ్ బాస్ హౌజ్‌లో భద్రతా చర్యలపై అనేక అనుమానాలు తలెత్తేలా చేస్తున్నాయి.
వీడియో వైరల్ అయిన కాసేపటికే జియో సినిమా టీమ్ ఈ క్లిప్ పై క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసింది. ఈ వీడియో నిజమైన వీడియో కాదని ఎవరో ఎడిట్ చేసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేశారని వాస్తవానికి అక్కడ ఎలాంటి పాము లేదని పేర్కొన్నారు. అయితే నెటిజన్స్ మాత్రం లైవ్ ఫీడ్ రికార్డ్ చేస్తే దానిని ఎలా ఎడిట్ చేయగలుగుతాం అని అంటున్నారు. మరోవైపు పాము గమనించిన నిర్వాహకులు అందరిని లోపలికి వెళ్లాల్సిందిగా తెలియజేస్తూ అన్ని ద్వారాలు మూసేసి, పాముని పట్టుకునే ప్రయత్నం చేశారని టాక్ కూడా బయటకు వచ్చింది.
This is Real Video . my girlfriend recorded it pic.twitter.com/EJu47CMS4W
— Rajasthani Tau Ji (@Rajasthanii_Tau) July 9, 2024