Shraddha Kapoor|స్టార్ హీరో ఇంట్లో అద్దెకు… ప్ర‌భాస్ హీరోయిన్‌కి అంత క‌ష్టం ఏమోచ్చింది..!

Shraddha Kapoor| బాలీవుడ్ ముద్దుగుమ్మ శ్ర‌ద్ధా క‌పూర్ గురించి ప్ర‌త్యేక ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద సంచలనాలు సృష్టిస్తోన్న సినిమా స్త్రీ 2 చిత్రంలో కీల‌క పాత్ర పోషించింది శ్రద్ధా కపూర్. హారర్ కామెడీ డ్రామాగా వచ్చిన ఈ సినిమా ఇప్పటివరకు రూ.400 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టింది. ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలై ఇప్పుడు రికార్డ్ బద్దలుకొడుతుంది. అయితే ఓవైపు తన సినిమా కోట్లు కొల్లగొడుతుంటే.. మరోవైపు హీరోయిన్ మాత్రం అద్దె ఇంట్లోకి షిఫ్ట్ అవుతుందట. ఈ విష‌యం తెలిసి అంద‌రు అవాక్క‌వుతున్నారు. స్త్రీ2 మూవీ సక్సెస్ ఎంజాయ్ చేస్తు

  • By: sn    cinema    Aug 30, 2024 7:50 AM IST
Shraddha Kapoor|స్టార్ హీరో ఇంట్లో అద్దెకు… ప్ర‌భాస్ హీరోయిన్‌కి అంత క‌ష్టం ఏమోచ్చింది..!

Shraddha Kapoor| బాలీవుడ్ ముద్దుగుమ్మ శ్ర‌ద్ధా క‌పూర్ గురించి ప్ర‌త్యేక ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద సంచలనాలు సృష్టిస్తోన్న సినిమా స్త్రీ 2 చిత్రంలో కీల‌క పాత్ర పోషించింది శ్రద్ధా కపూర్. హారర్ కామెడీ డ్రామాగా వచ్చిన ఈ సినిమా ఇప్పటివరకు రూ.400 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టింది. ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలై ఇప్పుడు రికార్డ్ బద్దలుకొడుతుంది. అయితే ఓవైపు తన సినిమా కోట్లు కొల్లగొడుతుంటే.. మరోవైపు హీరోయిన్ మాత్రం అద్దె ఇంట్లోకి షిఫ్ట్ అవుతుందట. ఈ విష‌యం తెలిసి అంద‌రు అవాక్క‌వుతున్నారు. స్త్రీ2 మూవీ సక్సెస్ ఎంజాయ్ చేస్తున్నశ్రద్ధా కపూర్.. ముంబైలోని జుహులో ప్రస్తుతం హృతిక్ రోషన్ ఉంటున్న ఇంటినే అద్దెకు తీసుకోబోతోంది. దీనికోసం ఆమె నెలకు రూ.10 లక్షల నుంచి రూ.15 లక్షలు అద్దె చెల్లించనున్నట్లు కూడా వార్తలు వస్తున్నాయి.

నిజానికి ఈ అపార్ట్‌మెంట్లోకి మొదట వరుణ్ ధావన్ వద్దామని అనుకున్నా.. డీల్ కుదర‌క‌పోవ‌డంతో ఇప్పుడు శ్రద్ధా మాత్రం ఈ డీల్ ఓకే చేసుకొని అందులోకి వెళ్లడానికి సిద్ధమవుతోంది. ఈ వార్త ఇప్పుడు నెట్టింట తెగ హ‌ల్‌చల్ చేస్తుంది. ఇప్పుడు శ్రద్ధా కపూర్ వెళ్తున్న బిల్డింగ్ లోనే బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ కూడా ఉంటున్నాడు. అందులోని ఓ లగ్జరీ డూప్లెక్స్ అపార్ట్‌మెంట్ అతని సొంతం కాగా, ఇప్పుడు శ్రద్ధ.. అతని పొరిగింట్లోకే వెళ్లబోతోంది. ఆమె నటించిన స్త్రీ2 మూవీలో అక్షయ్ కుమార్ కూడా అతిథి పాత్ర పోషించిన విషయం తెలిసిందే. ఇక ఇదిలా ఉంటే 1987లోనే శ్రద్ధా తండ్రి శక్తికపూర్‌ ఓ ఇంటిని కొన్నారు. మొన్నటివరకూ ఆ ఇంట్లోనే తండ్రితోపాటు శ్రద్ధా ఉండేది. ఆ ఇల్లు కట్టి 37ఏళ్లు అవుతున్నా.. ఇంకా పటిష్టంగానే ఉండటం గమనార్హం.

అయితే.. ఇల్లు పాత బడిపోవడం, ట్రెండ్‌కి తగ్గట్టు లేకపోవడం, దానికి తోడు పాతకాలం నాటి డిజైన్లు. అందుకే.. ఆ ఇంటిని మోడ్రనేట్‌ చేయాలని శ్రద్ధా భావించింది. తండ్రి నుంచి అనుమతి తీసుకొని ఇంటి రెన్నోవేషన్‌ పనులు మొదలుపెట్టింది. ఇందులో భాగంగానే సామాన్లతో సహా ఇంటిని ఖాళీ చేసి వేరే ఇంటికి షిఫ్ట్‌ అయ్యింది. ఈ అమ్మడు ప్ర‌భాస్‌తో క‌లిసి సాహో అనే చిత్రంలో న‌టించిన విష‌యం తెలిసిందే.. ఈచిత్రంతో తెలుగు ప్రేక్ష‌కుల‌కి ద‌గ్గ‌రైంది శ్ర‌ద్ధా