ఎంగేజ్‌మెంట్ త‌ర్వాత తొలిసారి త‌మ రిలేష‌న్‌షిప్ గురించి నోరు విప్పిన సిద్ధార్థ్

  • By: sn    cinema    Apr 07, 2024 10:30 AM IST
ఎంగేజ్‌మెంట్ త‌ర్వాత తొలిసారి త‌మ రిలేష‌న్‌షిప్ గురించి నోరు విప్పిన సిద్ధార్థ్

టాలీవుడ్‌లో ఒక‌ప్పుడు ల‌వ‌ర్ బోయ్ ఇమేజ్ అందుకున్న సిద్ధార్థ్ వైవిధ్య‌మైన సినిమాల‌తో ప్రేక్ష‌కుల‌ని ఎంత‌గానో అల‌రించాడు. ఇటీవ‌ల ఆయ‌న కెరీర్ గాడి త‌ప్పింది. ఇటు తెలుగు, అటు త‌మిళంలో పెద్ద హిట్స్ అనేవి రావ‌డం లేదు. సిద్ధార్థ్‌కి నువ్వోస్తానంటే నేనొద్దంటానా, బొమ్మరిల్లు, ఓయ్ వంటి ప్రేమకథ చిత్రాలు మంచి పేరు ప్రఖ్యాత‌లు తీసుకొచ్చాయి. సిద్ధార్థ్ చివ‌రిగా తెలుగులో మ‌హా సముద్రం అనే చిత్రం చేశాడు.ఈ చిత్రం ఫ్లాప్ అయిన కూడా ఈ సినిమాలో న‌టించిన అదితితో ప్రేమ‌లో ప‌డ్డాడు. గ‌త కొంత కాలంగా వీరిద్ద‌రు ప్రేమ‌లో ఉన్న‌ప్ప‌టికీ దానిపై క్లారిటీ అనేది ఇవ్వ‌డం లేదు. ఇటీవలే వీరిద్దరి వివాహం రహస్యంగా జరిగిందని న్యూస్ వినిపించింది.కాని ఆ త‌ర్వాత అది ఎంగేజ్‌మెంట్ అని తేలింది.

తెలంగాణలోని వనపర్తిలో ఉన్న శ్రీరంగనాయక ఆలయంలో ఇరు కుటుంబసభ్యులు, అతికొద్ది మంది స్నేహితుల సమక్షంలో సిద్ధార్థ్, అదితి ఎంగేజ్‌మెంట్ చేసుకున్నట్టు తెలుస్తుంది. చాలా ప్రైవేట్‌గా వీరి నిశ్చితార్థ వేడుక జ‌రిగింది. వారి నిశ్చితార్థంకి సంబంధించి ఒక్క ఫొటో కూడా బ‌య‌ట‌కు రాకుండా జాగ్ర‌త్త ప‌డ్డారు ఈ జంట‌. అయితే త‌ర్వాత మాత్రం త‌మ సోష‌ల్ మీడియా పేజ్‌లో రింగులు ధ‌రించి ఒక ఫొటో పోస్ట్ చేశారు. దీంతో అంద‌రికి ఓ క్లారిటీ వ‌చ్చింది. వారిద్ద‌రికి ఎంగేజ్‌మెంట్ జ‌రిగింద‌ని, త్వ‌ర‌లో పెళ్లి చేసుకోబోతున్నార‌ని భావించారు. అయితే తాజాగా సిద్ధార్థ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ఓ అవార్డ్ వేడుకలో పాల్గొన్న సిద్ధార్థ్ మాట్లాడుతూ.. “మేము రహస్యంగా నిశ్చితార్థం చేసుకున్నామని చాలా మంది అనుకుంటున్నారు. అయితే సీక్రెట్, ప్రైవేట్ అనే రెండు ప‌దాల‌కి మ‌ధ్య చాలా వ్య‌త్యాసం ఉంది.

నిశ్చితార్థానికి ఎవరినైతే పిలవలేదో వాళ్లు మాత్రమే దీనిని సీక్రెట్ వేడుక అనుకుంటున్నారు. మాది కుటుంబ స‌భ్యుల స‌మ‌క్షంలో జ‌రిగిన ప్రైవేట్ ఫంక్ష‌న్. ఇది సినిమా షూటింగ్ కాదు నేను నిర్ణ‌యించ‌డానికి.పెద్దల నిర్ణ‌యం ప్ర‌కారం ఇది జ‌రిగింది. వారు ఎప్పుడు ఎక్క‌డ జ‌ర‌పాలి అనుకుంటే అలా జ‌ర‌గుతుందని సిద్ధార్థ్ అన్నాడు. ఇక మీ ప్రపోజల్ ను అంగీకరించడానికి అదితి ఎన్ని రోజుల సమయం తీసుకున్నారు ? అని ప్ర‌శ్నించ‌గా దానికి స‌మాధానం ఇచ్చిన సిద్ధార్థ్ ద‌య‌చేసి అలాంటి ప్ర‌శ్న‌లు న‌న్ను అడ‌గొద్దు. నాకు ఎస్ లేదా నో అనేది ముఖ్యం. నేను ప్ర‌పోజ్ చేసిన‌ప్పుడు అదితి ఎస్ చెబుతుందా లేదా అని చాలా టెన్ష‌న్ ప‌డ్డాను. ఎట్ట‌కేల‌కి ఆమె అంగీక‌రించింది అని సిద్ధార్థ్ చెప్పుకొచ్చాడు. మ‌రి వీరి పెళ్లి ఎప్పుడు జ‌రుగుతుందో తెలియాల్సి ఉంది.