రంగం సినిమాకు పదేళ్లు

కొన్నిసార్లు డబ్బింగ్ సినిమాలే కదా అని లైట్ తీసుకుంటాం. కానీ అవే సినిమాలు బాక్సాఫీస్ దగ్గర సంచలన విజయం సాధిస్తుంటాయి. అప్పట్లో అపరిచితుడు, గజిని, ప్రేమిస్తే అలాంటి విజయాలనే సాధించి తెలుగు సినిమాలకు కూడా షాక్ ఇచ్చాయి. అలాంటి అద్భుతమైన మ‌రో సినిమా రంగం. ఈ మధ్యే కరోనాతో మరణించిన లెజెండరీ సినిమాటోగ్రఫర్, అద్భుతమైన దర్శకుడు కేవీ ఆనంద్ ఈ సినిమాను తెరకెక్కించాడు. జీవా హీరోగా రాధ పెద్ద కూతురు కార్తిక, పియా బాజ్‌పెయీ హీరోయిన్లుగా వచ్చిన […]

రంగం సినిమాకు పదేళ్లు

కొన్నిసార్లు డబ్బింగ్ సినిమాలే కదా అని లైట్ తీసుకుంటాం. కానీ అవే సినిమాలు బాక్సాఫీస్ దగ్గర సంచలన విజయం సాధిస్తుంటాయి. అప్పట్లో అపరిచితుడు, గజిని, ప్రేమిస్తే అలాంటి విజయాలనే సాధించి తెలుగు సినిమాలకు కూడా షాక్ ఇచ్చాయి. అలాంటి అద్భుతమైన మ‌రో సినిమా రంగం. ఈ మధ్యే కరోనాతో మరణించిన లెజెండరీ సినిమాటోగ్రఫర్, అద్భుతమైన దర్శకుడు కేవీ ఆనంద్ ఈ సినిమాను తెరకెక్కించాడు.

జీవా హీరోగా రాధ పెద్ద కూతురు కార్తిక, పియా బాజ్‌పెయీ హీరోయిన్లుగా వచ్చిన ఈ పొలిటికల్ మీడియా థ్రిల్లర్ సంచలన విజయం సాధించడమే కాకుండా జీవాకు తెలుగులో మార్కెట్ ఓపెన్ చేసింది. తమిళంలో కో పేరుతో కలెక్షన్స్ వర్షం కురిపించి తెలుగులో రంగంగా విడుదలైంది. ప్రకాశ్ రాజ్, అజ్మల్ ఈ సినిమాలో తమ నటనతో మైమరిపించారు. సూపర్ స్క్రీన్ ప్లేతో కేవీ ఆనంద్ చేసిన ఈ మాయాజాలం తెలుగులోనూ ప్రేక్షకుల మన్ననలు అందుకుంది. మే 13, 2011న విడుదలైన రంగం సినిమాకు పదేళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా ఫైనల్ కలెక్షన్స్ ఓసారి చూద్దాం.

పదేళ్ల కిందే రంగం సినిమా తెలుగులో 4.2 కోట్ల థియేట్రికల్ బిజినెస్ చేసింది. జీవా లాంటి ఎలాంటి మార్కెట్ లేని హీరోకు ఇది నిజంగానే ఎక్కువ కానీ అప్పటికే కేవీ ఆనంద్ వీడొక్కడే సినిమా తెలుగులో మంచి వసూళ్లు సాధించింది. దాంతో రంగం సినిమాకు అది బాగా హెల్ప్ అయింది. 4.5 కోట్ల లక్ష్యంతో బరిలోకి దిగిన రంగం.. ఎవరూ ఊహించని స్థాయిలో 11 కోట్లకు పైగా షేర్ వసూలు చేసింది. తద్వారా 7 కోట్లకు పైగానే లాభాలు బయ్యర్లకు అందించింది రంగం.