షూటింగ్ పూర్తి.. తిరిగి చెన్నైకు వెళ్లిన త‌లైవా

క‌రోనా సెకండ్ వేవ్ విజృంభిస్తున్న స‌మ‌యంలో ర‌జ‌నీకాంత్ రిస్క్ చేసి మ‌రీ హైద‌రాబాద్‌లో అన్నాత్తె చిత్రం 35 రోజుల షూటింగ్ పూర్తి చేశారు. సోమవారం సాయంత్రంతో తన పాత్రకు సంబంధించిన సన్నివేశాల చిత్రీకరణ పూర్తవడంతో, మంగళవారం రజనీకాంత్‌ చెన్నై వెళ్లినట్టు తెలుస్తుంది. ర‌జ‌నీకాంత్‌కు సంబంధించిన అన్ని స‌న్నివేశాల‌ను శివ షూట్ చేశాడ‌ట‌. ఇక న‌య‌న‌తార‌తో పాటు ఇత‌ర న‌టీన‌టుల‌పై కొన్ని స‌న్నివేశాల‌ను చిత్రీక‌రిస్తే షూటింగ్ పూర్త‌వుతుంద‌ని స‌మాచారం. తెలంగాణ ప్ర‌భుత్వం నైట్ క‌ర్ఫ్యూ విధించిన‌ప్ప‌టికీ ప్ర‌త్యేక అనుమ‌తితో […]

షూటింగ్ పూర్తి.. తిరిగి చెన్నైకు వెళ్లిన త‌లైవా

క‌రోనా సెకండ్ వేవ్ విజృంభిస్తున్న స‌మ‌యంలో ర‌జ‌నీకాంత్ రిస్క్ చేసి మ‌రీ హైద‌రాబాద్‌లో అన్నాత్తె చిత్రం 35 రోజుల షూటింగ్ పూర్తి చేశారు. సోమవారం సాయంత్రంతో తన పాత్రకు సంబంధించిన సన్నివేశాల చిత్రీకరణ పూర్తవడంతో, మంగళవారం రజనీకాంత్‌ చెన్నై వెళ్లినట్టు తెలుస్తుంది. ర‌జ‌నీకాంత్‌కు సంబంధించిన అన్ని స‌న్నివేశాల‌ను శివ షూట్ చేశాడ‌ట‌. ఇక న‌య‌న‌తార‌తో పాటు ఇత‌ర న‌టీన‌టుల‌పై కొన్ని స‌న్నివేశాల‌ను చిత్రీక‌రిస్తే షూటింగ్ పూర్త‌వుతుంద‌ని స‌మాచారం.

తెలంగాణ ప్ర‌భుత్వం నైట్ క‌ర్ఫ్యూ విధించిన‌ప్ప‌టికీ ప్ర‌త్యేక అనుమ‌తితో షూటింగ్ జ‌రిపారు అన్నాత్తె టీం.ఇక నేటి నుండి తెలంగాణ ప్ర‌భుత్వం లాక్ డౌన్ ప్ర‌క‌టించ‌డంతో మిగిలిన షూటింగ్ హైద‌రాబాద్‌లో ఎలా చేస్తారు అనే సందేహం అభిమానుల‌లో క‌లుగుతుంది. ఇక ఈ వారంలో అన్నాత్తె డ‌బ్బింగ్ పూర్తి చేసి ఆ త‌ర్వాత ర‌జ‌నీకాంత్ మెడిక‌ల్ చెక‌ప్ కోసం అమెరాకా వెళ్ల‌నున్న‌ట్టు ప‌లు వార్తలు వ‌స్తున్నాయి. కాగా,ధ‌నుష్ ఓ హాలీవుడ్ చిత్రీక‌ర‌ణ కోసం ఇటీవ‌ల అమెరికా వెళ్ల‌గా ఆయ‌నతో పాటు ఐశ్వ‌ర్య , పిల్ల‌ల‌ను కూడా తీసుకెళ్లార‌ట‌.