Trisha | వన్నెతగ్గని అందంతో కుర్ర హీరోయిన్లకు పోటీ ఇస్తున్న త్రిష.. బ్యూటీ సీక్రెట్‌ ఏంటో తెలుసా..?

Trisha | త్రిష కృష్ణన్‌ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. నాలుగు పదుల వయసులోనూ కుర్ర హీరోయిన్లకు గట్టి పోటీ ఇస్తున్నది. ప్రస్తుతం ఆరు సినిమాలు చేస్తూ కెరియర్‌లోనే మరోసారి ఫుల్‌ బిజీగా ఉన్నది. త్రిషతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన హీరోయిన్లంతా ప్రస్తుతం సైడ్‌ అయిపోయారు. కానీ, త్రిష మాత్రం వన్నెతగ్గని అందంతో ఇండస్ట్రీలో రాణిస్తున్నది. 41 సంవత్సరాల వయసులోనూ ఫిట్‌నెస్‌తోనే అందాన్ని మెయింటెన్‌ చేస్తూ వస్తున్నది. వయసు పెరిగేకొద్ది త్రిష అందం ఇంకా పెరుగుతున్నది అనడంలో సందేహం లేదు.

Trisha | వన్నెతగ్గని అందంతో కుర్ర హీరోయిన్లకు పోటీ ఇస్తున్న త్రిష.. బ్యూటీ సీక్రెట్‌ ఏంటో తెలుసా..?

Trisha | త్రిష కృష్ణన్‌ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. నాలుగు పదుల వయసులోనూ కుర్ర హీరోయిన్లకు గట్టి పోటీ ఇస్తున్నది. ప్రస్తుతం ఆరు సినిమాలు చేస్తూ కెరియర్‌లోనే మరోసారి ఫుల్‌ బిజీగా ఉన్నది. త్రిషతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన హీరోయిన్లంతా ప్రస్తుతం సైడ్‌ అయిపోయారు. కానీ, త్రిష మాత్రం వన్నెతగ్గని అందంతో ఇండస్ట్రీలో రాణిస్తున్నది. 41 సంవత్సరాల వయసులోనూ ఫిట్‌నెస్‌తోనే అందాన్ని మెయింటెన్‌ చేస్తూ వస్తున్నది. వయసు పెరిగేకొద్ది త్రిష అందం ఇంకా పెరుగుతున్నది అనడంలో సందేహం లేదు. అయితే, తాజాగా త్రిష తన ఫిట్‌నెస్‌ సీక్రెట్‌ను బయటపెట్టింది.

ప్రతిరోజూ వ్యాయామం

ప్రతిరోజూ వ్యాయామం చేయనున్నట్లు త్రిష పేర్కొంది. వాస్తవానికి శరీరం ఫిట్‌గా ఉండేందుకు నిత్యం వ్యాయామం చేయాలని అందరికీ తెలిసిందే. కానీ, చాలా తక్కువ మంది మాత్రమే నిత్యం చేస్తూ వస్తుంటారు. ఈ విషయంలో కఠినంగా ఉంటానని.. అదే తన బ్యూటీ సీక్రెట్‌ అని పేర్కొంది. ఉదయం నిద్రలేచాక వెంటనే గంటపాటు కార్డియోతో పాటు వ్యాయామం చేస్తుంది. అలాగే ఆహారం విషయంలో తప్పనిసరిగా రూల్స్‌ పాటిస్తూ వస్తుంది. పండ్లు, కూరగాయలు పుష్కలంగా తినాల్సిందేనని చెబుతున్నది. పండ్లు, కూరగాయల్లో ఎక్కువగా విటమిన్లు, ఖనిజాలు ఎక్కువగా ఉండేలా చూసుకోవాలని, తద్వారా శరీరం ఆరోగ్యంగా ఉండేలా సహాయపడుతాయని చెప్పింది. రాత్రిళ్లు డిన్నర్‌ను మాత్రం వీలైనం త్వరగా పూర్తి చేయాలని తెలిపింది.

డిన్నర్‌ విషయంలో..

డిన్నర్‌ సాయంత్రం 6.30 గంటలకు పూర్తి చేసి.. ఆ తర్వాత సైతం పండ్లు తీసుకుంటాన చెప్పుకొచ్చింది. అయితే, తిన్న తర్వాత వెంటనే నీళ్లు తాగొద్దని సూచించింది. వ్యాయామంతో పాటు ప్రతిరోజూ యోగం సాధన తప్పనిసరి అని చెప్పింది. ఎంత బిజీగా ఉన్న నిత్యం యోగా ఖచ్చితంగా చేస్తానని తెలిపింది. వీటితో పాటు స్విమ్మింగ్‌, టెక్కింగ్‌, సైక్లింగ్‌ తదితర యాక్టివిటీలు సైతం తనకు ఇష్టమని చెన్నై సుందరి తెలిపింది. ప్రతిరోజూ ఇలా చేస్తుండడం వస్తుండడంతో శరీరంలో ఉన్న ఎక్స్‌ట్రా క్యాలరీలు త్వరగా కరిగి.. బరువు పెరగకుండా చేస్తాయని.. విటమిట్లతో ఆరోగ్యంగా ఉంటామని వివరించింది.

చేతిలో ఐదు సినిమాలు

చిత్ర చివరిసారిగా దళపతి విజయ్‌ సరసన ‘లియో’లో వెండితెరపై కనిపించింది. ఇటీవల సోని లివ్‌ ఓటీటీలో ‘బ్రింద’లో కనిపించింది. ఇందులో పోలీస్‌ ఆఫీసర్‌గా కనిపించింది. ప్రస్తుతం తమిళంలో అజిత్‌ సరసన విదా ముయార్చితో పాటు థగ్‌లైఫ్‌లో నటిస్తున్నది. మలయాళంలో ఐడెంటిటీ, రామ్‌ చిత్రాలతో కనిపించబోతున్నది. ప్రస్తుతం ఈ సినిమాలు చిత్రీకరణ, పోస్ట్‌ప్రొడక్షన్‌ దశలో ఉన్నాయి. ఇక తెలుగులో మెగాస్టార్‌ చిరంజీవి సరసన విశ్వంభర మూవీలో జతకట్టబోతున్నది. 2006లో వచ్చిన స్టాలిన్‌లో చిరంజీవితో నటించిన త్రిష.. మళ్లీ చాలాకాలం తర్వాత నటిస్తున్నది.