వైరల్ ‘సర్కారు వారి పాట’.. మూవీ డైలాగ్ లీక్

విధాత:సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబు, కీర్తిసురేష్‌ హీరోహీరోయిన్లుగా పరశురామ్‌ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం 'సర్కారు వారి పాట'. కోవిడ్‌ సెకండ్‌ వేవ్‌ గ్యాప్‌ తర్వాత ఇటీవలే ఈ చిత్ర షూటింగ్‌ మళ్లీ మొదలైంది. షూటింగ్‌ మొదలైనట్లుగా చిత్రయూనిట్‌ ఓ పిక్‌ను మీడియాకు వదిలిన విషయం తెలిసిందే. ప్రస్తుతం హైదరాబాద్‌ పరిసర ప్రాంతాలలో ఈ చిత్ర షూటింగ్‌ జరుగుతుంది. ఈ షెడ్యూల్‌లో కీలక సన్నివేశాలను దర్శకుడు పరశురామ్‌ చిత్రీకరిస్తున్నారు. అయితే షూటింగ్‌ లొకేషన్‌లో మహేష్‌ బాబు చెబుతున్న భారీ […]

వైరల్ ‘సర్కారు వారి పాట’.. మూవీ డైలాగ్ లీక్

విధాత:సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబు, కీర్తిసురేష్‌ హీరోహీరోయిన్లుగా పరశురామ్‌ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘సర్కారు వారి పాట’. కోవిడ్‌ సెకండ్‌ వేవ్‌ గ్యాప్‌ తర్వాత ఇటీవలే ఈ చిత్ర షూటింగ్‌ మళ్లీ మొదలైంది. షూటింగ్‌ మొదలైనట్లుగా చిత్రయూనిట్‌ ఓ పిక్‌ను మీడియాకు వదిలిన విషయం తెలిసిందే. ప్రస్తుతం హైదరాబాద్‌ పరిసర ప్రాంతాలలో ఈ చిత్ర షూటింగ్‌ జరుగుతుంది. ఈ షెడ్యూల్‌లో కీలక సన్నివేశాలను దర్శకుడు పరశురామ్‌ చిత్రీకరిస్తున్నారు. అయితే షూటింగ్‌ లొకేషన్‌లో మహేష్‌ బాబు చెబుతున్న భారీ డైలాగ్‌ వీడియో ఒకటి.. తాజాగా సోషల్‌ మీడియాలో లీకైంది. సెట్‌లోని వారే ఎవరో ఈ వీడియోని ఫోన్‌లో బంధించి సోషల్‌ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.

ఈ వీడియోలో “పొద్దున్నే లేచి వాకింగ్ చేశామా.. మంచి డైట్ ఫుడ్ దొబ్బి తిన్నామా.. మళ్లీ సాయంత్రం అయ్యాక మొబైల్ చూశామా? కొడుకు, మనవడు, మనవరాలుతో ఆడుకుని.. మళ్లీ దొబ్బి తిని పడుకున్నామా? లేదా..? ఇదే కదా మనము చేసేది రోజూ..” అంటూ పబ్లిక్‌కు మహేష్‌ క్లాస్‌ ఇస్తున్నారు. ప్రస్తుతం ఈ లీక్‌డ్‌ వీడియో, అందులోని డైలాగ్‌ సోషల్‌ మీడియాని ఊపేస్తున్నాయి. మైత్రీ మూవీ మేకర్స్, జీఎమ్‌బి ఎంటర్టైన్మెంట్, 14 రీల్స్ ప్లస్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ ప్రెస్టీజియస్ మూవీకి లేటెస్ట్ మ్యూజిక్ సెన్సేష‌న్ థమ‌న్ ఎస్.ఎస్. సంగీత సార‌థ్యం వ‌హిస్తున్నారు.