Virat Kohli| జూనియ‌ర్ ఎన్టీఆర్ అంటే నాకు చాలా ఇష్టం..ఆయ‌న‌తో మ‌ళ్లీ న‌టిస్తానంటున్న విరాట్ కోహ్లీ

Virat Kohli| దివంగ‌త న‌టుడు, రాజకీయ నాయ‌కుడు నంద‌మూరి తార‌క‌రామారావు మ‌న‌వ‌డిగా ఇండ‌స్ట్రీకి వ‌చ్చి మంచి పేరు ప్ర‌ఖ్యాత‌లు సంపాదించుకున్నాడు ఎన్టీఆర్. ఆయ‌న దేశ వ్యాప్తంగా ఫాలోయింగ్‌ను, మార్కెట్‌ను ఏర్పరచుకుని పాన్ ఇండియా రేంజ్‌లో క్రేజ్ సంపాదించుకు

  • By: sn    cinema    May 27, 2024 10:36 AM IST
Virat Kohli| జూనియ‌ర్ ఎన్టీఆర్ అంటే నాకు చాలా ఇష్టం..ఆయ‌న‌తో మ‌ళ్లీ న‌టిస్తానంటున్న విరాట్ కోహ్లీ

Virat Kohli| దివంగ‌త న‌టుడు, రాజకీయ నాయ‌కుడు నంద‌మూరి తార‌క‌రామారావు మ‌న‌వ‌డిగా ఇండ‌స్ట్రీకి వ‌చ్చి మంచి పేరు ప్ర‌ఖ్యాత‌లు సంపాదించుకున్నాడు ఎన్టీఆర్. ఆయ‌న దేశ వ్యాప్తంగా ఫాలోయింగ్‌ను, మార్కెట్‌ను ఏర్పరచుకుని పాన్ ఇండియా రేంజ్‌లో క్రేజ్ సంపాదించుకున్నాడు. ఆర్ఆర్ఆర్ సినిమాతో ఎన్టీఆర్ ఖ్యాతి ఖండాంత‌రాలు దాటింది. ఈ సినిమా మంచి విజ‌యం సాధించ‌డంతో ఎన్టీఆర్ సినిమాల‌పై ఆస‌క్తి నెలకొంది. ప్ర‌స్తుతం కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో దేవ‌ర అనే భారీ బ‌డ్జెట్ చిత్రం చేస్తున్నాడు. ఈ సినిమా రెండు పార్ట్‌లుగా రూపొందుతుండ‌గా, తొలి పార్ట్ అక్టోబ‌ర్ 10న విడుద‌ల కానుంది.

మ‌ల్టీ టాలెంట్ ఉన్న ఎన్టీఆర్‌ని సామాన్యుల‌తో పాటు సెల‌బ్రిటీలు కూడా ఎంతో ఇష్ట‌ప‌డుతుంటారు. తాజాగా స్టార్ క్రికెటర్ విరాట్ క్లోహి..తారక్ గురించి ఆసక్తికర కామెంట్స్ చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు. జూనియర్ ఎన్టీర్ తన బెస్ట్ ఫ్రెండ్ అని చెప్పిన కోహ్లీ.. టాలీవుడ్ లో తారక్ తనకు మంచి స్నేహితుడంటూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. తార‌క్‌ని న‌టుడిగా నేను ఎంతో అభిమానిస్తా. ఆయ‌న టాలెంట్‌కి నేను ఫిదా అయ్యాను. కొన్నేళ్ల క్రితం ఎన్టీఆర్ తో కలిసి ఒక యాడ్ లో యాక్ట్ చేశాను. ఆ సమయంలో తారక్ వ్యక్తిత్వాన్ని చూసి ఫిదా అయ్యానంటూ కోహ్లీ చెప్పుకొచ్చాడు. తార‌క్ అంద‌రితో చాలా ఆప్యాయంగా మాట్లాడుతుంటాడు. అది నాకు బాగా న‌చ్చుతుంద‌ని కోహ్లీ పేర్కొన్నాడు.

ఇక ట్రిపుల్ ఆర్ సినిమాలో ఎన్టీఆర్ న‌ట‌న‌,డ్యాన్స్ అద్భుతం. చెప్ప‌డానికి మాట‌లు రావు. ఆర్ఆర్ఆర్ సినిమాలోని నాటు నాటు సాంగ్‌కి అనుష్క‌, నేను రీల్ కూడా చేశామ‌ని విరాట్ తెలియ‌జేశారు. ‘నాటు నాటు’ సాంగ్ కి ఆస్కార్ వచ్చిందని తెలిసి ఎంతో సంబరపడిపోయాం. ప్రత్యేక సందర్భాల్లో తారక్ కి వీడియో కాల్ చేసి మాట్లాడుతానని కోహ్లీ అన్నాడు. ఇద్ద‌రు స్టార్ లెజెండ్స్ మధ్య ఇంత మంచి సాన్నిహిత్యం ఉండ‌డంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు.ఇక ఎన్టీఆర్..బాలీవుడ్‌లో నేరుగా ‘వార్ 2’ అనే సినిమాలో నటిస్తున్నాడు. ఇందులో అతడు స్టార్ హీరో హృతిక్ రోషన్‌తో కలిసి చేస్తున్నాడు. స్పై యూనివర్శ్ నుంచి వచ్చి సక్సెస్ అయిన ‘వార్’ మూవీకి ఇది కొనసాగింపుగా రాబోతుంది.