Bhagyashri Borse | కుర్ర హీరోయిన్‌ క్రేజ్‌ మామూలుగా లేదుగా..? మరో రెండు సినిమాల్లో ఛాన్స్‌ కొట్టేసిన భాగ్యశ్రీ బోర్సే..!

Bhagyashri Borse | భాగ్యశ్రీ భోర్సే ప్రస్తుతం టాలీవుడ్‌లో సంచలనంగా మారింది. మాస్‌ మహారాజ్‌ రవితేజ హీరోగా తెరకెక్కుతున్న ‘మిస్టర్‌ బచ్చన్‌’తో భాగ్యశ్రీ టాలీవుడ్‌లోకి ఇంట్రీ ఇవ్వబోతున్నది. ఈ సినిమాకు హరీశ్‌ శంకర్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవల సినిమా షూటింగ్‌ పూజా కార్యక్రమాలతో మొదలయ్యాయి. ఆ సమయంలో భాగ్యశ్రీ సందడి చేసింది. అప్పటి నుంచి ఈ హీరోయిన్‌ కుర్రాళ్ల కలలరాణిగా మారింది.

  • Publish Date - April 14, 2024 / 10:00 AM IST

Bhagyashri Borse | భాగ్యశ్రీ భోర్సే ప్రస్తుతం టాలీవుడ్‌లో సంచలనంగా మారింది. మాస్‌ మహారాజ్‌ రవితేజ హీరోగా తెరకెక్కుతున్న ‘మిస్టర్‌ బచ్చన్‌’తో భాగ్యశ్రీ టాలీవుడ్‌లోకి ఇంట్రీ ఇవ్వబోతున్నది. ఈ సినిమాకు హరీశ్‌ శంకర్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవల సినిమా షూటింగ్‌ పూజా కార్యక్రమాలతో మొదలయ్యాయి. ఆ సమయంలో భాగ్యశ్రీ సందడి చేసింది. అప్పటి నుంచి ఈ హీరోయిన్‌ కుర్రాళ్ల కలలరాణిగా మారింది.

టాలీవుడ్‌లో క్రేజీ హీరోయిన్‌గా మారింది. మరోరెండు సినిమాల్లోనూ హీరోయిన్‌గా ఛాన్స్‌ వచ్చినట్లు తెలుస్తున్నది. ప్రస్తుతం విజయ్‌ దేవరకొండ హీరోగా గౌతమ్‌ తిన్ననూరి దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు. ఈ సినిమాలో హీరోయిన్‌గా కన్ఫర్మ్‌ చేసినట్లు టాక్‌. అలాగే న్యాచురల్‌ స్టార్‌ నాని ప్రస్తుతం వివేక్‌ ఆత్రేయ దర్శకత్వంలో ‘సరిపోదా శనివారం’ సినిమాను చేస్తున్నాడు. ఈ చిత్రాన్ని డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు. ఆ తర్వాత నాని సుజిత్ దర్శకత్వంలో ఓ సినిమాను చేయనుండగా.. దాన్ని కూడా డీవీవీ దానయ్యే నిర్మిస్తున్నారు. నాని 31వ సినిమాగా వస్తున్న సుజిత్ డైరెక్షన్ వచ్చే మూవీలో హీరోయిన్‌గా భాగ్యశ్రీ భోర్సేని ఖరారు చేసినట్లు తెలుస్తున్నది. సుజిత్ నాని కాంబో రాబోయే సినిమాలో మొదట పూజాహెగ్డేని హీరోయిన్‌గా తీసుకోనున్నారని ప్రచారం జరిగింది. టాలీవుడ్‌ బుట్టబొమ్మ చేతిలో ప్రస్తుతం ప్రాజెక్టులేమీ లేవు.

ఈ క్రమంలో నాని సినిమాతో కంబ్యాక్‌ ఇద్దామని భావించినా.. అవకాశం చేజారినట్లయ్యింది. ఈ అవకాశం కూడా భాగ్యశ్రీని వరించింది. మరో వైపు మిగతా యంగ్‌ హీరోలు సైతం తమ రాబోయే ప్రాజెక్టుల్లో భాగ్యశ్రీ పేరునే రెఫర్‌ చేస్తున్నట్లు వినికిడి. ఆకర్షణీయమైన రూపం, హాట్‌లుక్స్‌ ఉన్న ఈ బ్యూటీ హవాను కొనసాగించే అవకాశం ఉన్నది. భాగ్యశ్రీ స్వస్థలం మహారాష్ట్రలోని పుణే. మోడలింగ్ రంగంలోని రాణిస్తున్నది. ఇప్పటికే చాలా బ్రాండ్స్‌కి అంబాసిడర్‌గా ఉన్నది. ఈ క్రమంలో భాగ్యశ్రీ బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. ‘యారియాన్ 2’లో మెరిసింది.

Latest News