Health tips | మీరు ఆలుగడ్డ పొట్టును గీరి పారేస్తున్నారా.. అయితే ఈ విషయం తెలుసుకోవాల్సిందే..!
Health tips : చిన్నాపెద్దా అనే తేడా లేకుండా ఆలుగడ్డ కర్రీని (Potato curry) అందరూ ఇష్టంగా తింటారు. ఇక ఆలూ ఫ్రై (Potato fry) చేస్తే ఆ రుచే వేరు. ఆలూతో ఇంకా చాలా రకాల వంటలు చేయవచ్చు. అందరికీ ఎంతో ఇష్టమైన చిప్స్‌ను కూడా వీటితోనే తయారుచేస్తారు. ఆలుగడ్డలో చాలా పోషకాలు ఉంటాయి.

Health tips : చిన్నాపెద్దా అనే తేడా లేకుండా ఆలుగడ్డ కర్రీని (Potato curry) అందరూ ఇష్టంగా తింటారు. ఇక ఆలూ ఫ్రై (Potato fry) చేస్తే ఆ రుచే వేరు. ఆలూతో ఇంకా చాలా రకాల వంటలు చేయవచ్చు. అందరికీ ఎంతో ఇష్టమైన చిప్స్‌ను కూడా వీటితోనే తయారుచేస్తారు. ఆలుగడ్డలో చాలా పోషకాలు ఉంటాయి. ముఖ్యంగా ఆలుగడ్డ పొట్టులో (Potato peel) పోషకాలు మెండు. ఈ పోషకాలు మనకు అనారోగ్యాన్ని దరిచేరనివ్వవు. అయితే చాలా మంది ఆలూ తొక్కను తీసేసి వండుతారు. అయితే ఇలా చేయడం వల్ల పోషకాలు తొలగిపోతాయని నిపుణులు చెబుతున్నారు.
ఆలుగడ్డ తొక్కపై మట్టి, దుమ్ము ఉంటాయని పొట్టు తీసేస్తుంటారు. వాస్తవానికి ఆలూను పొట్టుతో సహా తినాలి. పొట్టులో అనేక విటమిన్‌లు, మినరల్స్ ఉంటాయి. ఇవి శరీరానికి శక్తిని ఇస్తాయి. ముఖ్యంగా ఫైబర్ ఉంటుంది. ఇది జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది. అంతేగాక ఆలుగడ్డ పొట్టులో పొటాషియం కూడా అధికంగా ఉంటుంది. ఇది హైబీపీని తగ్గిస్తుంది. నాడీ వ్యవస్థ పని తీరును చక్కబెడుతుంది.
ఆలూ పొట్టులో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ముఖ్యంగా ఫ్లేవనాయిడ్స్, కెరోటినాయిడ్స్, ఫినోలిక్ సమ్మేళనాలు అధికంగా లభ్యమవుతాయి. ఇవి గుండె జబ్బులు, క్యాన్సర్, నాడీ సంబంధ వ్యాధులు రాకుండా కాపాడుతాయి. ఆలూ పొట్టులోని పోషకాలతో ఆర్థరైటిస్, కీళ్లు, మోకాళ్ల నొప్పులు ఉన్నవారికి ఎంతగానో మేలు జరుగుతుంది. అధిక బరువు సమస్య నుంచి బయటపడతారు. మెరిసే చర్మం మీ సొంతమవుతుంది. అందుకే ఇప్పటి నుంచైనా ఆలుగడ్డ తొక్కతో వండుకోవడానికి ప్రయత్నించండి. లేదంటే విలువైన పోషకాలను కోల్పోతారు.