లైంగిక వేధింపుల కేసులో న‌టుడు ప్రాచీన్ చౌహాన్ అరెస్ట్‌

విధాత‌,ముంబై: ఏక్తా కపూర్ పాపులర్ షో కసౌటీ జిందగీ నటుడు ప్రాచీన్ చౌహాన్‌ను ముంబై మాల్డా ఈస్ట్ పోలీసులు అరెస్టు చేశారు. ప్రాచీన్ చౌహాన్ లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ నేపధ్యంలో అతనిపై మాల్డ్ ఈస్ట్ పోలీస్ స్టేషన్‌లో కేను నమోదయ్యింది. దీంతో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ప్రాచీన్ చౌహాన్ అరెస్ట్‌తో హిందీ బుల్లితెర ఉలిక్కిపడింది. దీనికి ముందు టీవీ నటుడు ఫర్ల్ వీ పురి బాలికపై అత్యాచారానికి పాల్పడిన ఘటనలో అరెస్టయ్యారు. ఈమధ్యనే అతనికి బెయిల్ […]

లైంగిక వేధింపుల కేసులో న‌టుడు ప్రాచీన్ చౌహాన్ అరెస్ట్‌

విధాత‌,ముంబై: ఏక్తా కపూర్ పాపులర్ షో కసౌటీ జిందగీ నటుడు ప్రాచీన్ చౌహాన్‌ను ముంబై మాల్డా ఈస్ట్ పోలీసులు అరెస్టు చేశారు. ప్రాచీన్ చౌహాన్ లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ నేపధ్యంలో అతనిపై మాల్డ్ ఈస్ట్ పోలీస్ స్టేషన్‌లో కేను నమోదయ్యింది. దీంతో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ప్రాచీన్ చౌహాన్ అరెస్ట్‌తో హిందీ బుల్లితెర ఉలిక్కిపడింది. దీనికి ముందు టీవీ నటుడు ఫర్ల్ వీ పురి బాలికపై అత్యాచారానికి పాల్పడిన ఘటనలో అరెస్టయ్యారు. ఈమధ్యనే అతనికి బెయిల్ లభించింది. ప్రాచీన్ చౌహాన్ స్టార్ ప్లస్ టీవీలో ప్రసారమవుతున్న కసౌటీ జిందగీ సీరియల్‌లో సుబ్రతో బసు క్యారెక్టర్ చేస్తున్నారు. ఇదేవిధంగా కుఛ్ ఝుకీ పల్కే, సింధూర్ తేనే నామ్ కా సాత్ ఫెరె, మాతా పితా కే చరణోంమే స్వర్గ్ తదితర సీరియళ్లలో కూడా నటిస్తున్నారు. కాగా ప్రాచీన్ అరెస్టు వెనుకగల కారణాలు ఇంకా వెల్లడికావాల్సివుంది.

Readmore:ప్రేమోన్మాదులకు సమాజంలో బతికే అర్హత లేదు