ద్విచ‌క్ర‌వాహ‌నాలు దొంగిలించే ముఠా అరెస్ట్

విధాత‌: ద్విచ‌క్ర‌వాహ‌నాలు దొంగిలించే ముఠాను అరెస్టు చేసి వారి నుంచి 20 బైక్‌లు, ఒక స్కూటీ స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ విజయభాస్కర్‌ తెలిపారు.. నరసరావుపేట పనసతోటకు చెందిన కటారి సాయి కల్యాణ్‌, ఈపూరు మండలం ఇనిమెళ్ల గ్రామానికి చెందిన రుద్రు మహేష్‌, దుద్దుకూరి వెంకటాంజి, మాచవరం మండలం కొత్తగణేషునిపాడు గ్రామానికి చెందిన పసుపులేటి ఏసురత్నంలతోపాటు ఇద్దరు మైనర్లు ముఠాగా ఏర్పడి దొంగతనాలకు పాల్పడుతున్నారు. గుంటూరు జిల్లాతో పాటు తెలంగాణ రాష్ట్రంలోనూ వారు బైక్‌లు చోరీ చేశారు. నకరికల్లు […]

ద్విచ‌క్ర‌వాహ‌నాలు దొంగిలించే ముఠా అరెస్ట్

విధాత‌: ద్విచ‌క్ర‌వాహ‌నాలు దొంగిలించే ముఠాను అరెస్టు చేసి వారి నుంచి 20 బైక్‌లు, ఒక స్కూటీ స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ విజయభాస్కర్‌ తెలిపారు.. నరసరావుపేట పనసతోటకు చెందిన కటారి సాయి కల్యాణ్‌, ఈపూరు మండలం ఇనిమెళ్ల గ్రామానికి చెందిన రుద్రు మహేష్‌, దుద్దుకూరి వెంకటాంజి, మాచవరం మండలం కొత్తగణేషునిపాడు గ్రామానికి చెందిన పసుపులేటి ఏసురత్నంలతోపాటు ఇద్దరు మైనర్లు ముఠాగా ఏర్పడి దొంగతనాలకు పాల్పడుతున్నారు. గుంటూరు జిల్లాతో పాటు తెలంగాణ రాష్ట్రంలోనూ వారు బైక్‌లు చోరీ చేశారు. నకరికల్లు పోలీసులు ఈ ముఠాపై నిఘా ఉంచి అరెస్టు చేశారు. సమావేశంలో నరసరావుపేట రూరల్‌ సీఐ యలగాల అచ్చయ్య, నకరికల్లు ఎస్‌ఐ పేరాల ఉదయబాబులు పాల్గొన్నారు.