స్కూటర్ ను ఢీకొన్న బస్సు-యువకుడు మృతి

విధాత:చిత్తూరు‌ జిల్లా సత్యవేడు హీరో పరిశ్రమ వద్ధ కోల్గేట్ పరిశ్రమ బస్సు ఢీకొని యువకుడు మృతి చెందిన సంఘటన మంగళవారం మధ్యాహ్నం చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. నెల్లూరు జిల్లా నాయుడుపేట మండలం కమ్మవారిపాళెం కు చెందిన చెందిన లక్ష్మయ్య కుమారుడు శ్రీనివాసులు(27) ,భార్య తంగమణి గ్రామమైన సత్యవేడు మండలంలోని రామచంద్రాపురం లో కాపురం ఉంటున్నాడు. భార్య చెల్లెలు నెల్లూరు లో ఉండటంతో ఆమెను ఇంటికి తీసుకురావడానికి బయల్దేరిన శ్రీనివాసులు ,కోల్గేట్ పరిశ్రమ బస్సు ఢీకొనడంతో […]

స్కూటర్ ను ఢీకొన్న  బస్సు-యువకుడు మృతి

విధాత:చిత్తూరు‌ జిల్లా సత్యవేడు హీరో పరిశ్రమ వద్ధ కోల్గేట్ పరిశ్రమ బస్సు ఢీకొని యువకుడు మృతి చెందిన సంఘటన మంగళవారం మధ్యాహ్నం చోటు చేసుకుంది.

వివరాలు ఇలా ఉన్నాయి.

నెల్లూరు జిల్లా నాయుడుపేట మండలం కమ్మవారిపాళెం కు చెందిన చెందిన లక్ష్మయ్య కుమారుడు శ్రీనివాసులు(27) ,భార్య తంగమణి గ్రామమైన సత్యవేడు మండలంలోని రామచంద్రాపురం లో కాపురం ఉంటున్నాడు.

భార్య చెల్లెలు నెల్లూరు లో ఉండటంతో ఆమెను ఇంటికి తీసుకురావడానికి బయల్దేరిన శ్రీనివాసులు ,కోల్గేట్ పరిశ్రమ బస్సు ఢీకొనడంతో రోడ్డు ప్రమాదానికి గురై మరణించినట్లు స్థానికులు తెలిపారు.

మృతుడికి భార్య,కూతురు ఉన్నారు.
రోడ్డు ప్రమాద ఘనటపై శ్రీసిటీ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.