పెళ్లయిన ఎనిమిది నెలలకే..రోడ్డు ప్రమాదంలో బ్యాంకు ఉద్యోగి దుర్మరణం
అనంతపురం జిల్లా తాడిమర్రి మండల పరిధిలోని నార్శింపల్లి గ్రామ సమీపంలో సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో బ్యాంకు ఉద్యోగి ఆనంద్(31) మృతి చెందారు. ఈయన స్వస్థలం కర్నూలు జిల్లా సి.బెళగల్ మండలం కంబదహళ్లి గ్రామం. ఎనిమిది నెలల క్రితమే ఆనంద్‌కు వివాహమైంది. నార్శింపల్లి ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంకులో క్యాషియర్‌గా విధులు నిర్వహిస్తున్న ఆనంద్ దివ్యాంగుడు. తన మూడు చక్రాల వాహనంలో బత్తలపల్లి నుంచి బ్యాంకు విధులకు హాజరయ్యేవారు. బ్యాంక్‌కు వస్తున్న సమయంలో బత్తలపల్లి నుంచి ఓ ట్రాక్టర్ […]

అనంతపురం జిల్లా తాడిమర్రి మండల పరిధిలోని నార్శింపల్లి గ్రామ సమీపంలో సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో బ్యాంకు ఉద్యోగి ఆనంద్(31) మృతి చెందారు. ఈయన స్వస్థలం కర్నూలు జిల్లా సి.బెళగల్ మండలం కంబదహళ్లి గ్రామం.
ఎనిమిది నెలల క్రితమే ఆనంద్‌కు వివాహమైంది. నార్శింపల్లి ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంకులో క్యాషియర్‌గా విధులు నిర్వహిస్తున్న ఆనంద్ దివ్యాంగుడు. తన మూడు చక్రాల వాహనంలో బత్తలపల్లి నుంచి బ్యాంకు విధులకు హాజరయ్యేవారు.
బ్యాంక్‌కు వస్తున్న సమయంలో బత్తలపల్లి నుంచి ఓ ట్రాక్టర్ తాడిమర్రి వైపు వస్తోంది. దానిని అధిగమించబోయి అదుపు తప్పి పక్కనే గోతిలోకి పడ్డారు.
సంఘటనా స్థలంలో ఉన్న కొందరు విషయాన్ని బ్యాంకు మేనేజర్‌కు తెలిపారు. హుటాహుటిన వచ్చిన ఆయన తన కారులోనే క్షతగాత్రున్ని బత్తలపల్లిలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే ఆనంద్ మృతిచెందినట్లు నిర్ధారించారు. పోలీసులు ప్రమాదంపై వివరాలు ఆరా తీస్తున్నారు.