వరంగల్ జిల్లాలో రోడ్డు ప్రమాదం, తండ్రీకుమార్తె మృతి
వరంగల్ జిల్లా రాయపర్తి మండలం కిష్టాపురం జాతీయ రహదారిపై శనివారం ఉదయం ద్విచక్రవాహనాన్ని కారు ఢీకొట్టింది. ప్రమాదంలో తండ్రీకుమార్తె అక్కడికక్కడే మృతి చెందారు

– ద్విచక్ర వాహనం, కారు ఢీ
– అల్లుడికి తీవ్ర గాయాలు
విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: వరంగల్ జిల్లా రాయపర్తి మండలం కిష్టాపురం జాతీయ రహదారిపై శనివారం ఉదయం ద్విచక్రవాహనాన్ని కారు ఢీకొట్టింది. ప్రమాదంలో తండ్రీకుమార్తె అక్కడికక్కడే మృతి చెందారు. అల్లుడికి తీవ్ర గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించారు.
మృతులు మొరిపిరాలకు చెందిన ఓరుగంటి వెంకన్న, ముజంపల్లి అనూషగా గుర్తించారు. ఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. తీవ్రంగా గాయపడిన ముజంపల్లి రాజు చికిత్స పొందుతున్నారు. బతుకమ్మ పండుగ సందర్భంగా బిడ్డ, అల్లుడితో కలిసి మామ ఓరుగంటి వెంకన్న ద్విచక్రవాహనంపై వస్తుండగా కారు ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది.