మాజీ ఎంపీ వివేక్‌పై ఫెమా కేసులు.. 200కోట్ల అక్రమ లావాదేవిల గుర్తింపు
చెన్నూర్ కాంగ్రెస్ అభ్యర్థి వివేక్ పై ఫెమా చట్టం కింద కేసులు నమోదు చేసినట్లుగా ఈడీ ప్రకటించింది. వివేక్ ఇంట్లో సోదాలకు సంబంధించి ప్రకటన విడుదల చేసింది

విధాత : మాజీ ఎంపీ, చెన్నూర్ కాంగ్రెస్ అభ్యర్థి వివేక్ వెంకటస్వామిపై ఫెమా చట్టం కింద కేసులు నమోదు చేసినట్లుగా ఈడీ ప్రకటించింది. వివేక్ ఇంట్లో సోదాలకు సంబంధించి ఈడీ ప్రకటన విడుదల చేసింది. విజిలెన్స్ సెక్యూరిటీ పేరుతో వివేక్ పెద్ద ఎత్తున అక్రమ లావాదేవీలు సాగించినట్లుగా గుర్తించామని తెలిపింది. 200 కోట్ల అక్రమ లావాదేవీలను గుర్తించినట్లుగా వెల్లడించింది. నకిలీ పత్రాలతో ఆస్తులు కొనుగోలు చేసినట్లుగా గుర్తించామని పేర్కోంది. యశ్వంత్ రియాల్టీతో పాటుగా గడ్డం వివేక్ భార్య పేర్లతో భారీగా అక్రమ ఆస్తులున్నాయని, విజిలెన్స్ సెక్యూరిటీ పేరుతో ఎలాంటి వ్యాపారం లేకపోయినా భారీగా లావాదేవిలు సాగించారని తెలిపింది. విజిలెన్స్ సెక్యూరిటీ పేరుతో ఇప్పటివరకు20 లక్షల టాక్స్ చెల్లించినట్లు గుర్తించామని ఈడీ ప్రకటించింది.