Breaking: సికింద్రాబాద్‌లో అగ్ని ప్రమాదం.. ఏడుగురు సజీవదహనం(Video)
విధాత: సికింద్రాబాద్‌ళోని రూబీ ఎలక్ట్రికల్ బైక్ షోరూంలో సోమవారం రాత్రి ఘోర అగ్ని ప్రమాదం. సంభవించింది. బైక్ షోరూంలో ఉన్న ఎలక్ట్రిక్ బైకులు పూర్తిగా తగలబడి మంటలు పైనే ఉన్న రూబీ హోటల్‌కు ఎగిసిపడడంతో దట్టమైన పోగ కమ్మి హోటల్‌లో ఉన్నవారు ఊపిరాడక మరణించారు. ఈ ప్రమాదంలో ఏడుగురు ప్రాణాలు కోల్పోయినట్లు నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ వెల్లడించారు. గాయపడిన నలుగురిని యశోద దవాఖానకు తరలించినట్టు తెలిపారు. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. ప్రమాదానికి […]

విధాత: సికింద్రాబాద్‌ళోని రూబీ ఎలక్ట్రికల్ బైక్ షోరూంలో సోమవారం రాత్రి ఘోర అగ్ని ప్రమాదం. సంభవించింది. బైక్ షోరూంలో ఉన్న ఎలక్ట్రిక్ బైకులు పూర్తిగా తగలబడి మంటలు పైనే ఉన్న రూబీ హోటల్‌కు ఎగిసిపడడంతో దట్టమైన పోగ కమ్మి హోటల్‌లో ఉన్నవారు ఊపిరాడక మరణించారు.

ఈ ప్రమాదంలో ఏడుగురు ప్రాణాలు కోల్పోయినట్లు నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ వెల్లడించారు. గాయపడిన నలుగురిని యశోద దవాఖానకు తరలించినట్టు తెలిపారు. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. ప్రమాదానికి కారణాలు ఇంకా తెలియరాలేదు.
8కి చేరిన మృతుల సంఖ్య
సికింద్రాబాద్‌లోని ఎలక్ట్రిక్ బైక్ షోరూంలో జరిగిన అగ్నిప్రమాదంలో మృతుల సంఖ్య 8కి చేరింది. ఈ షాపులోని ఒక బ్యాటరీ పేలడంతోనే మంటలు వ్యాపించినట్లు పోలీసులు గుర్తించారు. తాజాగా ఈ ప్రమాదంలో మరొకరు మరణించినట్లు తెలుస్తోంది.
ప్రమాద సమయంలో లాడ్జిలో 25 మంది ఉన్నట్లు పోలీసులు తెలిపారు. వారిలో కొందరు కిటికీల వద్ద ఉన్న పైపుల నుంచి బయటకు వచ్చేందుకు ప్రయత్నించారు. లాడ్జిలో ఉన్న 9 మందిని అగ్నిమాపక సిబ్బంది కాపాడినట్లు తెలుస్తోంది.
మృతుల్లో ఒక మహిళ కూడా ఉన్నట్లు చెప్పారు. రూబీ లాడ్జి ఘటనపై దర్యాప్తులో భాగంగా లాడ్జిని అధికారులుసీజ్ చేశారు. సెల్లార్‌లో నిబంధనలకు విరుద్ధంగా షోరూం నిర్వహిస్తున్నందుకు రంజిత్ అనే వ్యక్తిపై కేసు నమోదు చేశారు.
ప్రధాని మోదీ తీవ్ర దిగ్భ్రాంతి
కింద్రాబాద్‌లో ఓ లాడ్జిలో జరిగిన ఘోర ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపిన ప్రధాని మోదీ.. గాయపడిన వాళ్లు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
ప్రమాదంలో మరణించిన వాళ్లకు పీఎంఎన్‌ఆర్‌ఎఫ్ ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి తరపున 2 లక్షలు, గాయపడిన వాళ్లకు 50వేలు ఆర్థిక సాయం అందించనున్నట్లు ఆయన తెలిపారు. ఈ మేరకు ప్రధాని కార్యాలయం ట్విటర్‌లో ఓ ట్వీట్ చేసింది.
మంత్రి కేటీఆర్ సంతాపం
సికింద్రాబాద్‌లో జరిగిన అగ్ని ప్రమాద ఘటనపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరపున మంత్రి కేటీఆర్ తీవ్ర సంతాపం తెలిపారు. ఈ దుర్ఘటనలో మరణించిన వారి కుటుంబాలకు మూడు లక్షల చొప్పున ఎక్స్ గ్రేషియాను తెలంగాణ ప్రభుత్వం తరపున అందించనున్నట్లు తెలిపారు.