వైద్యం అంద‌క గ‌ర్భిణి మృతి

విధాత‌: క‌డ‌ప జిల్లా, రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రిలో మంగళవారం వైద్యం అంద‌క నిండు గర్భిణి మృతి చెందింది. పుల్లంపేట మండలం వల్లూరుపల్లికి చెందిన నాగమణెమ్మ (24)ను రెండో కాన్పు కోసం భర్త ఈశ్వరయ్య ఈనెల 3న రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొచ్చారు. వైద్యుడు అనిల్‌ పరీక్షించారు. మంగళవారం ఉదయం ఆమె మృతి చెందారు.. వైద్యుల నిర్లక్ష్యం వల్లే నాగమణెమ్మ మృతి చెందినట్లు ఆరోపిస్తూ బంధువులు ఆందోళనకు దిగారు. సోమవారం సాయంత్రం ఆసుపత్రికి తీసుకొస్తే మంగళవారం ఉదయం వరకు […]

వైద్యం అంద‌క గ‌ర్భిణి మృతి

విధాత‌: క‌డ‌ప జిల్లా, రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రిలో మంగళవారం వైద్యం అంద‌క నిండు గర్భిణి మృతి చెందింది. పుల్లంపేట మండలం వల్లూరుపల్లికి చెందిన నాగమణెమ్మ (24)ను రెండో కాన్పు కోసం భర్త ఈశ్వరయ్య ఈనెల 3న రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొచ్చారు.

వైద్యుడు అనిల్‌ పరీక్షించారు. మంగళవారం ఉదయం ఆమె మృతి చెందారు.. వైద్యుల నిర్లక్ష్యం వల్లే నాగమణెమ్మ మృతి చెందినట్లు ఆరోపిస్తూ బంధువులు ఆందోళనకు దిగారు. సోమవారం సాయంత్రం ఆసుపత్రికి తీసుకొస్తే మంగళవారం ఉదయం వరకు కూడా కాన్పు చేయలేదని కుటుంబ స‌భ్యులు ఆరోపించారు.