కాంగ్రెస్ వాహనాలను స్వాధీనం చేసుకున్న పోలీసులు

విధాత, హైదరాబాద్: కాంగ్రెస్ ప్రచార రథాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సిబ్బంది అంతా వెళ్లిపోయాకా గాంధీభవన్‌లోనికి వెళ్లిన పోలీసులు అక్కడ ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రచార రథాలను తీసుకెళ్లారు. పోలీసుల వైఖరిని కాంగ్రెస్ పార్టీ నాయకులు ఖండించారు. పోలీసులు బీఆరెస్‌కు తొత్తులుగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. పోలీసులు వెంటనే కాంగ్రెస్ పార్టీ వాహనాలను తిరిగి గాంధీ భవన్ లో అప్పగించాలని డిమాండ్ చేశారు. లేకపోతే తెలంగాణ వ్యాప్తంగా ఉద్యమిస్తామని చామల కిరణ్ హెచ్చరించారు.
