లారీ ఢీకొని మహిళా బ్యాంకు ఉద్యోగిని మృతి
గురుద్వారా, : గురుద్వారా కూడలిలో బుధవారం మధ్యాహ్నం సిమెంట్ కాంక్రీట్ మిక్సర్ లారీ ఢీకొని మహిళా ఉద్యోగిని మృతిచెందింది. దీనికి సంబంధించి నాలుగోపట్టణ పోలీసులు తెలిపిన వివరాలు ఇలా… అల్లిపురానికి చెందిన అల్లూరి జయశ్రీరెడ్డి(35) సీతమ్మధార హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకులో పనిచేస్తున్నారు. బుధవారం మధ్యాహ్నం విధులు ముగించుకొని తన ద్విచక్ర వాహనంపై వస్తూ గురుద్వారా జంక్షన్‌లో కాంప్లెక్స్ వైపు వెళ్లడానికి అకస్మాత్తుగా కుడివైపునకు వాహనాన్ని తిప్పగా.. సత్యం కూడలి వైపు వెళ్లే సిమెంట్ మిక్సర్ లారీ ఢీకొంది. లారీ […]

గురుద్వారా, : గురుద్వారా కూడలిలో బుధవారం మధ్యాహ్నం సిమెంట్ కాంక్రీట్ మిక్సర్ లారీ ఢీకొని మహిళా ఉద్యోగిని మృతిచెందింది. దీనికి సంబంధించి నాలుగోపట్టణ పోలీసులు తెలిపిన వివరాలు ఇలా… అల్లిపురానికి చెందిన అల్లూరి జయశ్రీరెడ్డి(35) సీతమ్మధార హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకులో పనిచేస్తున్నారు.
బుధవారం మధ్యాహ్నం విధులు ముగించుకొని తన ద్విచక్ర వాహనంపై వస్తూ గురుద్వారా జంక్షన్‌లో కాంప్లెక్స్ వైపు వెళ్లడానికి అకస్మాత్తుగా కుడివైపునకు వాహనాన్ని తిప్పగా.. సత్యం కూడలి వైపు వెళ్లే సిమెంట్ మిక్సర్ లారీ ఢీకొంది. లారీ ఆమెపై నుంచి వెళ్లడంతో అక్కడికక్కడే మృతిచెందారు.
ఈమెకు తొమ్మిదేళ్ల కుమార్తె ఉన్నారు. ఈ సంఘటనతో ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. పోలీసులు మృతదేహాన్ని తరలించి ట్రాఫిక్‌ను సరిదిద్దారు. నాలుగో పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.