పేలిన మొబైల్.. నిద్రలోనే మహిళ మృతి
విధాత: మొబైల్ ఫోన్లలో గంటల తరబడి మాట్లాడొద్దని, తక్కువగా వినియోగించాలని నిపుణులు హెచ్చరించినప్పటికీ ప్రజలు పట్టించుకోరు. అంతేకాదు ఆ మొబైల్ పక్కన లేకపోతే నిద్ర రాదే అన్నట్టు.. దాన్ని తల పక్కనే పెట్టుకుని నిద్రిస్తారు. అలా ఓ మహిళ తన మొబైల్ ఫోన్‌ను తల పక్కన పెట్టుకుని నిద్రిస్తుండగా.. ఆ ఫోన్ పేలిపోయింది. మహిళ మృతి చెందింది. ఈ ఘటన ఢిల్లీ - ఎన్సీఆర్ రీజియన్‌లో చోటు చేసుకుంది. ఈ విషయాన్ని ఎండీ టాక్ అనే యూట్యూబ్ […]

విధాత: మొబైల్ ఫోన్లలో గంటల తరబడి మాట్లాడొద్దని, తక్కువగా వినియోగించాలని నిపుణులు హెచ్చరించినప్పటికీ ప్రజలు పట్టించుకోరు. అంతేకాదు ఆ మొబైల్ పక్కన లేకపోతే నిద్ర రాదే అన్నట్టు.. దాన్ని తల పక్కనే పెట్టుకుని నిద్రిస్తారు.
అలా ఓ మహిళ తన మొబైల్ ఫోన్‌ను తల పక్కన పెట్టుకుని నిద్రిస్తుండగా.. ఆ ఫోన్ పేలిపోయింది. మహిళ మృతి చెందింది. ఈ ఘటన ఢిల్లీ – ఎన్సీఆర్ రీజియన్‌లో చోటు చేసుకుంది. ఈ విషయాన్ని ఎండీ టాక్ అనే యూట్యూబ్ ఛానెల్ నడిపే మంజీత్ తన ట్విట్టర్ ఖాతాలో వెల్లడించాడు.