హనుమకొండలో కాల్పుల కలకలం.. అత్తను కాల్చి చంపిన అల్లుడు
హనుమకొండ లో కాల్పులు కలకలం సృష్టించాయి. కాకతీయ యూనివర్సిటీ పరిధిలోని గుండ్ల సింగారంలో అత్తను అల్లుడు కాల్చి చంపిన సంఘటన గురువారం జరిగింది

విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: హనుమకొండ లో కాల్పులు కలకలం సృష్టించాయి. కాకతీయ యూనివర్సిటీ పరిధిలోని గుండ్ల సింగారంలో అత్తను అల్లుడు కాల్చి చంపిన సంఘటన గురువారం జరిగింది. తోటపల్లిలో కానిస్టేబుల్ గా పనిచేస్తున్న అడ ప్రసాద్ తన అత్తను సర్వీస్ రివాల్వర్ తో కాల్చాడు. దీంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. అత్తా అల్లుడి మధ్య నేలకొన్న ఆర్థిక వివాదాలే ఈ సంఘటనకు కారణంగా పోలీసులు భావిస్తున్నారు. విషయం తెలిసిన పోలీసులు ఘటన స్థలాన్ని వెంటనే చేరుకొని ప్రసాద్‌ను అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.