మరో నిరుద్యోగి ఆత్మహత్య.. హాస్టల్‌లోనే బలవన్మరణం
హిమాయత్ నగర్‌లోని వెలమ హాస్టల్‌లో ఉంటున్న బీటెక్ విద్యార్థి జగిత్యాల జిల్లా మల్యాల మండలం పోతారం గ్రామానికి చెందిన సాయిరాం(30) ఆత్మహత్యకు పాల్పడ్డాడు

విధాత : హిమాయత్ నగర్‌లోని వెలమ హాస్టల్‌లో ఉంటున్న బీటెక్ విద్యార్థి జగిత్యాల జిల్లా మల్యాల మండలం పోతారం గ్రామానికి చెందిన సాయిరాం(30) ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆదివారం హాస్టలో్ రూమ్‌లోనే పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. పోటీ పరీక్షలకు సన్నద్దమవుతూ, ఉద్యోగ ప్రయత్నాల్లో భాగంగా సాయిరాం కొంత కాలంగా హాస్టల్‌లో ఉంటున్నాడు. ఇటీవల చిక్కడపల్లిలో వరంగల్ జిల్లాకు చెందిన గ్రూప్ 2అభ్యర్ధి ప్రవళిక హాస్టల్‌లోనే ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మరువకముందే మరో నిరుద్యోగి సాయిరాం ఆత్మహత్య చేసుకోవడం సంచలనం రేపుతోంది