కారుతో ఈడ్చుకెళ్లి.. చంపేశారు!

ఓ ట్యాక్సీ ఓన‌ర్ క‌మ్ డ్రైవ‌ర్‌ను కొంద‌రు దారుణంగా చంపేశారు. ర‌హ‌దారిపై కారుతో 200 మీట‌ర్లు ఈడ్చుకెళ్లారు. తీవ్ర గాయాల‌పాలైన అత‌డు చ‌నిపోయాడు

కారుతో ఈడ్చుకెళ్లి.. చంపేశారు!

విధాత‌: ఓ ట్యాక్సీ ఓన‌ర్ క‌మ్ డ్రైవ‌ర్‌ను కొంద‌రు దారుణంగా చంపేశారు. ర‌హ‌దారిపై కారుతో 200 మీట‌ర్లు ఈడ్చుకెళ్లారు. తీవ్ర గాయాల‌పాలైన అత‌డు చ‌నిపోయాడు. మంగ‌ళ‌వారం రాత్రి ఢిల్లీలోని మహిపాల్‌పూర్‌లో తాజాగా జ‌రిగిన ఈ ఘ‌ట‌న వీడియో సోష‌ల్ మీడియాలో సంచ‌ల‌నంగా మారింది. బాధితుడిని ఫరీదాబాద్‌కు చెందిన బిజేంద్రగా గుర్తించారు. ఇత‌డు టాక్సీ కారు యజమాని/డ్రైవర్. ర‌హ‌దారిపై అత‌డిని కారులో ఈడ్చుకెళ్తున్న వీడియో సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్న‌ది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉన్న‌ది