పట్టపగలు, నడిరోడ్డు పై కాల్పులు.. డాక్టర్ దంపతులు మృతి.
పట్టపగలు, నడిరోడ్డుపై అందరూ చూస్తుండగా ఓ యువకుడు గన్ తో డాక్టర్ దంపతులపై కాల్పులు జరిపాడు. ఈ సంఘటన రాజస్థాన్‌లోని భరత్‌పూర్‌లో చోటు చేసుకుంది.కాల్పులకు సంబంధించిన దృశ్యాలు సమీపంలోని సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి. డాక్టర్ దంపతులు ఓ కారులో వెళ్తుండగా దాని వెనకాలే బైకుపై ఇద్దరు యువకులు వచ్చి, నడిరోడ్డుపై కారు ముందు బైకును ఆపారు. దీంతో కారును ఆపిన డాక్టరు విండో తెరచాడు. ఆ వెంటనే ఓ యువకుడు బైకు దిగి తుపాకీ తీసి డాక్టర్ […]

పట్టపగలు, నడిరోడ్డుపై అందరూ చూస్తుండగా ఓ యువకుడు గన్ తో డాక్టర్ దంపతులపై కాల్పులు జరిపాడు. ఈ సంఘటన రాజస్థాన్‌లోని భరత్‌పూర్‌లో చోటు చేసుకుంది.కాల్పులకు సంబంధించిన దృశ్యాలు సమీపంలోని సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి. డాక్టర్ దంపతులు ఓ కారులో వెళ్తుండగా దాని వెనకాలే బైకుపై ఇద్దరు యువకులు వచ్చి, నడిరోడ్డుపై కారు ముందు బైకును ఆపారు.
దీంతో కారును ఆపిన డాక్టరు విండో తెరచాడు. ఆ వెంటనే ఓ యువకుడు బైకు దిగి తుపాకీ తీసి డాక్టర్ దంపతులపై కాల్పులు జరిపాడు.ఆ సమయంలో మరో యువకుడు బైకుపైనే కూర్చున్నాడు. కాల్పులు జరిపిన యువకుడు ఆ వెంటనే బైకు ఎక్కగా, మరో యువకుడు బైకును నడిపాడు. ఇద్దరూ అక్కడి నుంచి పారిపోయారు.
రెండేళ్లుగా విచారణ జరుగుతోన్న ఓ యువతి హత్య కేసులో డాక్టర్ కుటుంబ సభ్యులు నిందితులుగా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే వారిపై కాల్పులు జరిగినట్లు తెలుస్తోంది.రెండేళ్ల క్రితం హత్యకు గురైన యువతి సోదరుడే డాక్టర్ దంపతులపై కాల్పులు జరిపినట్లు పోలీసులు గుర్తించారు.
డాక్టర్ తో గతంలో ఆ యువతికి సన్నిహిత సంబంధం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఆ యువతి హత్యకు గురైంది. ఈ కేసులో డాక్టర్ భార్యతో పాటు ఆయన తల్లి కూడా నిందితులుగా ఉన్నారు.