వైసీపీ కౌన్సిలర్ దారుణ హత్య
విధాత:నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట 16వ వార్డు వైసీపీ కౌన్సిలర్ తాళ్లూరు వెంకటసురేష్ (49) దారుణహత్యకు గురయ్యారు. సోమవారం తన జన్మదినం కావడంతో కుటుంబంతో కలసి ఆదివారం సాయంత్రం ఆయన తిరుమల వెళ్లారు.సోమవారం ఉదయం దర్శనం చేసుకొని సాయంత్రం 4.30 గంటలకు సూళ్లూరుపేట వచ్చారు. కుటుంబసభ్యులను బ్రాహ్మణవీధిలోని ఇంటి వద్ద వదిలి పొట్టి శ్రీరాములువీధిలో ప్రైవేట్ కారు పార్కింగ్‌లో తన కారును పార్క్ చేసేందుకు వెళ్లిన సురేష్. గంట గడిచినా ఇంటికి రాకపోవడంతో కుటుంబసభ్యులు ఫోన్ చేశారు. సమాధానం […]

విధాత:నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట 16వ వార్డు వైసీపీ కౌన్సిలర్ తాళ్లూరు వెంకటసురేష్ (49) దారుణహత్యకు గురయ్యారు. సోమవారం తన జన్మదినం కావడంతో కుటుంబంతో కలసి ఆదివారం సాయంత్రం ఆయన తిరుమల వెళ్లారు.సోమవారం ఉదయం దర్శనం చేసుకొని సాయంత్రం 4.30 గంటలకు సూళ్లూరుపేట వచ్చారు. కుటుంబసభ్యులను బ్రాహ్మణవీధిలోని ఇంటి వద్ద వదిలి పొట్టి శ్రీరాములువీధిలో ప్రైవేట్ కారు పార్కింగ్‌లో తన కారును పార్క్ చేసేందుకు వెళ్లిన సురేష్. గంట గడిచినా ఇంటికి రాకపోవడంతో కుటుంబసభ్యులు ఫోన్ చేశారు.
సమాధానం రాకపోవడంతో కుమారుడు ధీరజ్ కారుషెడ్ వద్దకు వెళ్లాడు.షెడ్‌గేట్ తాళాలు వేసి ఉండటం చూసి కారు లోపల ఉందా? లేదా? అని చూసేందుకు గేటు దూకి వెళ్లాడు. కారులో తండ్రి రక్తపు మడుగులో పడి ఉండటంచూసి గగ్గోలు పెట్టాడు.సురేష్ కడుపులో,గుండెలపై కత్తిపోట్లు ఉన్నాయి.ఆర్థిక లావాదేవీల వల్ల హతమార్చారా లేదా మరేదైన కారణాలా తెలియాల్సి ఉంది.ఎస్‌ఐ ఉమాశంకర్ కేసు దర్యాప్తు చేస్తున్నారు.