Gotram | ‘సగోత్రికులు’ పెళ్లి చేసుకుంటే సంతాన సమస్యలు ఏర్పడుతాయా..? అసలు ‘గోత్రం’ అంటే అర్థం ఏంటి..?
Gotram | హిందూ సంప్రదాయం( Hindu Custom )లో వివాహం( Marriage ) జరిపించాలంటే గోత్రానికి( Gotram ) అత్యధిక ప్రాధాన్యత ఇస్తారు. గోత్రం తెలుసుకున్న తర్వాతే పెళ్లిచూపులు, నిశ్చితార్థాలు( Engagement ), వివాహాది కార్యక్రమాలను ప్రారంభిస్తారు. ఎందుకంటే ఇరువురి గోత్రం ఒకటే ఉంటే.. పెళ్లికి అసలు ఒప్పుకోరు.

Gotram | హిందూ సంప్రదాయం( Hindu Custom )లో వివాహం( Marriage ) జరిపించాలంటే గోత్రానికి( Gotram ) అత్యధిక ప్రాధాన్యత ఇస్తారు. గోత్రం తెలుసుకున్న తర్వాతే పెళ్లిచూపులు, నిశ్చితార్థాలు( Engagement ), వివాహాది కార్యక్రమాలను ప్రారంభిస్తారు. ఎందుకంటే ఇరువురి గోత్రం ఒకటే ఉంటే.. పెళ్లికి అసలు ఒప్పుకోరు. ఇలా అమ్మాయి, అబ్బాయి గోత్రం( Gotram ) ఒకటే ఉంటే.. వారిని సగోత్రీకులు( Sagotrikulu ) అని పిలుస్తారు. సగోత్రీకుల మధ్య పెళ్లిళ్లకు పెద్దలు అంగీకరించరు. అయితే ఈ గోత్రం వెనుకాల ఉన్న కథేంటి..? అసలు ఈ పదం ఎలా వచ్చిందో తెలుసుకుందాం..
గోత్రం అర్థం..
గోత్రం( Gotram ) అనే పదం ‘గౌః’ అనే సంస్కృత పద మూలం నుంచి ఉద్భవించింది. ‘గౌః’ అంటే గోవులు( Cows ) అని అర్థం. అంతేకాకుండా గోత్రం అనే పదానికి గురువు, భూమి( Earth ), వేదం, గోవుల సమూహం అనే అర్థాలు కూడా ఉన్నాయని పండితులు చెబుతున్నారు. గోత్రం అనగా మన వంశోత్పాదకులైన ఆది మహర్షులలో మొదటి మహర్షి మూల పురుషుడి పేరు. గోత్రం అనే పదం తొలిసారిగా ఛాందోగ్యోపనిషత్‌లో ఉన్న సత్యకామ జాబిలి కథలో చూడొచ్చు.
గోత్రం నేపథ్యం ఇదే..
ఇక పురాతన కాలంలో ప్రతి కుటుంబానికి గోవులే ధనం. కాబట్టి గోవుల మేతకు, వాటి సంరక్షణ నిమిత్తం ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వలస వెళ్లేవారు. అలా వలస వెళ్లే క్రమంలో గోవులకు గోత్రాలను ఏర్పరిచారు. ఒకరి గోవులు మరొకరి గోవులలో కలిసిపోవడం వల్ల వచ్చే గొడవలను తపోనిష్ఠతో ఉండే గోత్ర పాలకులు తీర్చేవారు. అలాంటి గోత్రపాలకుల పేర్లే ఆపై వారి వారి సంతానానికి గోత్ర నామాలయ్యాయి. వారి వంశక్రమంలో జన్మించిన వారు, వారి వారి మూల పురుషులను గోత్ర నామంతో ఆరాధిస్తున్నారు. పూజల్లో, యజ్ఞాల్లో, యాగాల్లో, వివాహ సంబంధమైన విషయాల్లో గోత్రానికి ప్రాధాన్యత ఇవ్వడం మొదలైంది.
సగోత్రికులు సోదర సమానులు
ఒకే గోత్రానికి చెందిన వారు సోదర సమానులు. ఎలాగైతే ఒకే తండ్రి పిల్లలు అన్నాచెల్లెళ్లు అవుతారో అలాగే ఒకే గోత్రానికి చెందిన వారు అన్నదమ్ములు, అక్కాచెల్లెళ్లు అవుతారు. అందుకని సంబంధం కుదుర్చుకునే ముందు గోత్రాలను తెలుసుకుంటారు. వేర్వేరు గోత్రాల వారికి మాత్రమే పెళ్లి చేస్తారు. సగోత్రికులకు ఎన్నడూ వివాహం చేయరాదు.
సంతానంలో లోపాలు..!
సగోత్రికులు( Sagotrikulu ) అంటే ఒకే గోత్రం కలిగిన వారు అని అర్థం. వారి యొక్క జన్యువుల యొక్క నమూనాలు కూడా కొద్దిగా ఒకే రీతిని పోలి ఉంటాయి. తద్వారా వీరు వివాహం చేసుకుంటే.. సరైన సంతానం కలగకపోవచ్చని శాస్త్రీయంగా నిర్ధారణ కూడా జరిగింది. ఒకే గోత్రం ఉన్నవారు వివాహం చేసుకుంటే సంతానంలో కూడా లోపాలు ఉంటాయని గమనించి మన పూర్వీకులు ఇలాంటి పద్ధతిని ఆచారంగా పాటిస్తున్నారు.