Temples | గుడి నుంచి ఇంటికి వ‌చ్చాక కాళ్లు క‌డుక్కోవ‌చ్చా..?

Temples | భ‌క్తి భావం ఉన్న‌వారు నిత్యం ఏదో ఒక ఆల‌యాని( Temple )కి వెళ్తుంటారు. దైవ ద‌ర్శ‌నం అనంత‌రం నేరుగా ఇంటికి వ‌చ్చేస్తారు. అయితే ఇంటికి వ‌చ్చిన వెంట‌నే కాళ్లు క‌డుక్కోవ‌చ్చా..? అనే విష‌యంపై సందేహం ఉంటుంది.

Temples | గుడి నుంచి ఇంటికి వ‌చ్చాక కాళ్లు క‌డుక్కోవ‌చ్చా..?

Temples | త‌మ‌కు నచ్చిన దేవుళ్ల‌ను( God ) పూజించేందుకు, మొక్కులు చెల్లించుకునేందుకు భ‌క్తులు( Devotees ) ఆల‌యాల‌కు( Temple ) వెళ్తుంటారు. ఇక గుడిలోకి వెళ్లే క్ర‌మంలో తెలిసీ తెలియ‌క చాలా మంది త‌ప్పులు చేస్తుంటారు. ఆల‌యం నుంచి ఇంటికి వ‌చ్చాక కూడా పొర‌పాట్లు చేస్తుంటారు. అలా పొర‌పాట్లు చేయ‌డం వ‌ల్ల దేవుడి అనుగ్ర‌హం మ‌న ప‌ట్ల పూర్తిగా త‌గ్గిపోతుంద‌ని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. మ‌రి ఏం పొర‌పాట్లు చేయ‌కూడ‌దో ఇప్పుడు తెలుసుకుందాం.

ఆల‌యంలో పాటించాల్సిన నియ‌మాలు ఇవే..

  • భ‌క్తులు ఎవ‌రైనా స‌రే.. ఆల‌యం వ‌ద్ద‌కు చేరుకోగానే పాద‌ర‌క్ష‌లు బ‌య‌ట‌నే వ‌దిలేస్తారు. కొంద‌రు శుభ్రంగా కాళ్లు క‌డుక్కోని ఆల‌య ప్ర‌వేశం చేస్తుంటారు. కానీ కొంద‌రు నేరుగా వెళ్తుంటారు. ఇది మంచిది కాద‌ని జ్యోతిష్య పండితులు హెచ్చ‌రిస్తున్నారు. కాళ్లు క‌డుక్కోని, కొన్ని నీళ్లు త‌ల‌పై చ‌ల్లుకోని ఆల‌య ప్ర‌వేశం చేయాల‌ని సూచిస్తున్నారు.
  • ఆల‌యం లోప‌లికి ధ్వజస్తంభానికి ఎడమ వైపు నుంచి వెళ్తుంటారు. కానీ, ఎప్పుడూ అలా వెళ్లకూడదట. ఎప్పుడు గుడిలోకి వెళ్లినా సరే ధ్వజస్తంభానికి కుడి వైపు నుంచే వెళ్లాలి. అప్పుడే భగవంతుడి దర్శనం భాగ్యం సంపూర్ణంగా కలుగుతుందంటున్నారు.
  • గుడికి వెళ్లినప్పుడు ముందుగా నవ గ్రహాలను దర్శనం చేసుకోవాలా? భగవంతుడిని దర్శించుకోవాలా? అనే సందేహం చాలా మందికి కలుగుతుంది. అయితే, జ్యోతిష్యశాస్త్రం ప్రకారం ఎప్పుడైనా సరే మొదటగా నవ గ్రహాలను దర్శనం చేసుకొని ఆ తర్వాత కాళ్లు కడుక్కొని దేవాలయంలోకి వెళ్లి భగవంతుడిని దర్శనం చేసుకోవాలి.
  • అలాగే, దర్శనం చేసుకునేటప్పుడు దేవుడికి ఎదురుగా నిలబడవద్దు. కొంచం పక్కగా నిలబడి మాత్రమే భగవంతుడిని దర్శనం చేసుకోవాలంటున్నారు.
  • దైవ దర్శనం అనంతరం బయటకు వెళ్లేటప్పుడు దేవుడికి మన వీపు పూర్తిగా చూపించకుండా వెళ్లాలి. అలాగే, ఆలయం నుంచి బయటకు వచ్చాక తప్పనిసరిగా రెండు నిమిషాలు ఆ ప్రాంగణంలో కూర్చోవాలి.
  • చాలా మంది గుడిలో ఇచ్చిన ప్రసాదాన్ని బయట మార్గమధ్యలో తింటుంటారు. కానీ, అలా ఎప్పుడూ చేయకూడదంటున్నారు జ్యోతిష్యులు మాచిరాజు. సాధ్యమైనంత వరకు అక్కడ ఇచ్చిన ప్రసాదాన్ని టెంపుల్​లోనే తినేసి ఆ తర్వాత బయటకు వెళ్లాలంటున్నారు.
  • గుడికి వెళ్లినప్పుడు అక్కడ రావి చెట్టు, వేప చెట్టు కలిసి ఉంటే మాత్రం తప్పకుండా వాటికి ప్రదక్షిణలు చేసి ఇంటికి రావాలి. అలా చేస్తే సంపూర్ణమైన శుభ ఫలితాలు కలుగుతాయంటున్నారు జ్యోతిష్యులు.
  • ఏదైనా ఆలయానికి వెళ్లినప్పుడు చాలా మందికి గుడి నుంచి నేరుగా ఇంటికి రావాలా? వేరే ప్రదేశాలకు వెళ్లొచ్చా? అనే సందేహాలు కలుగుతుంటాయి. అయితే, జ్యోతిష్యశాస్త్రం ప్రకారం మీరు కేవలం గుడికి వెళ్లాలని వెళ్తే మాత్రం తిరిగి తప్పకుండా ఇంటికే రావాలి. అలాకాకుండా, ఏదైనా పని మీద వెళ్లేటప్పుడు టెంపుల్​కి వెళ్తే ఆ పని చూసుకొని ఇంటికి రావొచ్చు.
  • గుడి నుంచి ఇంటికి వచ్చిన వెంటనే కాళ్లు కడుక్కోకూడదు. అలా చేస్తే దేవుడిని దర్శించుకున్న ఫలితం పోతుందంటున్నారు. కనీసం ఒక 5 నిమిషాలు ఇంట్లో కూర్చోవాలి.
  • అదేవిధంగా, గుడి నుంచి ఇంటికొచ్చాక వెంటనే స్నానం చేయకూడదు. 48 నిమిషాలు ఆగి ఆ తర్వాత మాత్రమే స్నానమాచరించాలి.