25.06.2024 మంగళవారం రాశిఫలాలు.. ఈ రాశివారికి కల్యాణ ఘడియలు..!
చాలా మంది జ్యోతిష్యాన్ని అనుసరిస్తుంటారు. రోజు వారి రాశిఫలాలకు అనుగుణంగా శుభ కార్యాలు, కొత్త పనులను ప్రారంభిస్తారు. దిన ఫలాలు చూడనిదే కొందరు ఏ పని ప్రారంభించరు. మరి నేటి రాశిఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం..

మేషం
మేషరాశి వారికి ఈ రోజు అద్భుతంగా ఉంటుంది. అన్నిరంగాల వారికి చేపట్టిన ప్రతి పని విజయవంతం అవుతుంది. ఆర్ధికంగా బలపడతారు. వ్యాపారస్తులకు ప్రయాణాలు లాభిస్తాయి. ఇంట్లో శుభకార్యాలు జరిగే సూచనలు ఉన్నాయి. బంధు మిత్రులతో విందు వినోదాలలో పాల్గొంటారు.
వృషభం
వృషభరాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. ఆర్ధిక వ్యవహారాల్లో అప్రమత్తంగా ఉండాలి. ఇంటా బయటా సమస్యలు ఎదురవుతాయి. అన్ని రంగాల వారు పనుల్లో విజయం సాధించడానికి మీ శక్తిసామర్ద్యాలు మొత్తం వినియోగించాల్సి ఉంటుంది.
మిథునం
మిథునరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంది. మొదలుపెట్టిన పనులను పట్టుదలతో పూర్తి చేసి అందరి ప్రశంసలు అందుకుంటారు. ఉద్యోగులకు శ్రమతోనే విజయం సిద్ధిస్తుంది. ఇంట్లో శాంతి సౌఖ్యం ఉంటాయి. స్వల్ప అనారోగ్య సమస్యలుంటాయి.
కర్కాటకం
కర్కాటకరాశి వారికి ఈ రోజు అనుకూల ఫలితాలు ఉంటాయి. వృత్తి వ్యాపార రంగాల వారు తమ తమ రంగాలలో గొప్ప శుభ ఫలితాలను అందుకుంటారు. ఈ రోజంతా స్నేహితులు, కుటుంబంతో సంతోషంగా గడుపుతారు. ఆర్ధిక పరిస్థితి మెరుగవుతుంది.
సింహం
సింహరాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఆత్మవిశ్వాసంతో, పట్టుదలతో అన్ని పనులు సమయానికి పూర్తిచేస్తారు. ఆర్ధిక సమస్యలు రాకుండా జాగ్రత్త పడాలి. కోపం అదుపులో ఉంచుకోవాలి. ఎవరితోనూ వాదనల్లోకి దిగవద్దు.
కన్య
కన్యారాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు వుంటాయి. కష్టే ఫలి అనే సూత్రం ఈ రోజు కన్యారాశి వారికి వర్తిస్తుంది. కుటుంబ సభ్యుల వైఖరి ఆందోళన కలిగిస్తుంది. తీవ్రమైన పని ఒత్తిడి కారణంగా ఆరోగ్యం దెబ్బతింటుంది. ఖర్చులు పెరుగుతాయి.
తుల
తులారాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. వృత్తి వ్యాపార ఉద్యోగ రంగాల వారికి సానుకూల ఫలితాలు ఉంటాయి. మీ పరుషపు మాటల కారణంగా సన్నిహితులతో సంబంధాలు దెబ్బ తింటాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ సహనం కోల్పోకండి.
వృశ్చికం
వృశ్చికరాశి వారికి ఈ రోజు అదృష్టదాయకంగా ఉంటుంది. అన్ని రంగాల వారికి వృత్తి వ్యాపారాలలో ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఆర్ధికంగా బలోపేతం అవుతారు. కొత్త పనులు మొదలు పెట్టడానికి ఈ రోజు అనుకూలంగా ఉంది. బంధు మిత్రులతో విందు వినోదాలలో పాల్గొంటారు.
ధనుస్సు
ధనుస్సురాశి వారికి ఈ రోజు సాధారణంగా ఉంటుంది. అన్ని రంగాల వారికి తీవ్రమైన శ్రమతోనే పనులు పూర్తవుతాయి. ఆర్ధిక లావాదేవీలు నిర్వహించేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారులకు అనుకోని రీతిలో వ్యాపారంలో నష్టాలు వస్తాయి. ఆదాయాన్ని మించిన ఖర్చులు ఉంటాయి.
మకరం
మకరరాశి వారికి ఈ రోజు అనుకూలమైన రోజు. అన్ని రంగాల వారికి ఈ రోజు వృత్తి పరంగా, కుటుంబ పరంగా అనుకూల ఫలితాలు ఉంటాయి. వ్యాపారులకు లాభాల పంట పండుతుంది. చేపట్టిన పనులన్నీ సకాలంలో పూర్తి అవుతాయి. సన్నిహితులతో విందు వినోదాలలో పాల్గొంటారు. అవివాహితులకు కల్యాణఘడియలు సమీపిస్తాయి.
కుంభం
కుంభరాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉండవచ్చు. ఉద్యోగులకు కాలం కలిసి వస్తుంది. పనిలో మీరు చూపే నైపుణ్యం ఈ రోజు అద్బుతాలు చేస్తుంది. కుటుంబంలో కొన్ని సమస్యలు ఏర్పడవచ్చు. ఒకింత మానసిక ఒత్తిడికి లోను కావడం వల్ల ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి.
మీనం
మీనరాశి వారికి ఈ రోజు సాధారణంగా ఉంటుంది. సమయానుకూలంగా నడుచుకుంటే మంచిది. వ్యాపారులు తీవ్రమైన పోటీ ఎదుర్కొంటారు. లాభాలు కూడా అంతంతమాత్రంగానే ఉంటాయి. ఆరోగ్యం ఇబ్బంది పెడుతుంది. ఆదాయాన్ని మించిన ఖర్చులు ఉండవచ్చు.