26.06.2024 బుధ‌వారం రాశిఫ‌లాలు.. మీ రాశిఫ‌లం ఎలా ఉందంటే..?

చాలా మంది జ్యోతిష్యాన్ని అనుస‌రిస్తుంటారు. రోజు వారి రాశిఫ‌లాల‌కు అనుగుణంగా శుభ కార్యాలు, కొత్త ప‌నుల‌ను ప్రారంభిస్తారు. దిన ఫ‌లాలు చూడ‌నిదే కొంద‌రు ఏ ప‌ని ప్రారంభించ‌రు. మ‌రి నేటి రాశిఫ‌లాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం..

26.06.2024 బుధ‌వారం రాశిఫ‌లాలు.. మీ రాశిఫ‌లం ఎలా ఉందంటే..?

మేషం

మేషరాశి వారికి ఈ రోజు లాభదాయకంగా ఉంటుంది. ఈ రోజు ఏర్పడే కొత్త పరిచయాలు రాబోయే రోజుల్లో ఉపయోగకరంగా ఉంటాయి. ఊహించని ఖర్చులకు అవకాశం ఉంది. ఆర్థిక క్రమశిక్షణ అవసరం. వ్యాపారులు చేస్తున్న వ్యాపారంలో విజయాలను అందుకుంటారు.

వృషభం

వృషభరాశి వారికి ఈ రోజు గొప్పగా ఉంటుంది. ప్రత్యేకించి వ్యాపారులకు ఈ రోజు చాలా శుభప్రదంగా ఉంటుంది. ఉద్యోగులు సహోద్యోగుల నుంచి, పైఅధికారుల నుంచి సహకారం అందుకుంటారు. సంపదలు వృద్ధి చెందుతాయి. ఆరోగ్యం బాగుంటుంది.

మిథునం

మిథునరాశి వారికి ఈరోజు అంత అనుకూలంగా ఉండదు. శారీరకంగా, మానసికంగా బలహీనంగా ఉంటారు. శ్రద్ధ లేకుండా చేసే పనులు విజయాలను తీసుకురావు. వృథా ఖర్చులు పెరుగుతాయి. వ్యాపారంలో పెట్టిన పెట్టుబడులు నష్టాలను తీసుకు వస్తాయి.

కర్కాటకం

కర్కాటకరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. ఆటంకాలు, సవాళ్లను విజయవంతంగా ఎదుర్కొంటారు. క్లిష్ట పరిస్థితుల నుంచి సమర్థవంతంగా బయటపడతారు. వృత్తి జీవితంలో, వ్యక్తిగత జీవితంలో ఎటువంటి ఎలాంటి సమస్యలు, ఆటంకాలు లేకుండా సాగిపోతుంది.

సింహం

సింహరాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. వృత్తి వ్యాపార రంగాల వారికి పనుల్లో ఆశించిన మేరకు అభివృద్ధి ఉండకపోవచ్చు. జీవిత భాగస్వామితో మనస్పర్థలు ఏర్పడవచ్చు. కోపాన్ని అదుపులో ఉంచుకొని సహనంతో మెలిగితే మేలు. ఓపికతో లేకపోతే నష్టం వాటిల్లుతుంది. వాదనలకు దూరంగా ఉండండి.

కన్య

కన్యారాశి వారికి ఈ రోజు శుభకరంగా ఉంటుంది. వ్యాపారులకు ఈ రోజు మంచి యోగకరంగా ఉంటుంది. ఓ మిత్రుని సహకారంతో ఎటువంటి ఆటంకాలు లేకుండా కొత్త వ్యాపారం ప్రారంభిస్తారు. సంపదలు పెరుగుతాయి. ఆకస్మిక ధనలాభం ఉండవచ్చు.

తుల

తులారాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. ఉద్యోగులు పనిలో నిర్లక్ష్య వైఖరి కారణంగాపై అధికారుల ఆగ్రహానికి గురవుతారు. ఉద్యోగ అవకాశాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు అవకాశాలు రావడం ఆలస్యం కావచ్చు. సహనంతో ఉండండి.

వృశ్చికం

వృశ్చికరాశి వారికి ఈ రోజు విశేషమైన ప్రయోజనాలు ఉంటాయి. ఈ రాశి వారిని ఈ రోజు అధికారం అందలమెక్కిస్తుంది. ఆర్థికంగా గొప్ప ప్రయోజనాలు ఉంటాయి. వ్యాపారులు ఊహించని లాభాలను అందుకుంటారు. శుభవార్త వింటారు.

ధనుస్సు

ధనుస్సురాశి వారికి ఈ రోజు ప్రతికూల ఫలితాలు ఉండవచ్చు. గ్రహసంచారం సరిగా లేదు కాబట్టి మంచి చేసినా చెడు ఎదురవుతుంది. ఆర్థిక పరిస్థితి అదుపు తప్పడం వలన మానసిక ఆందోళనకు గురవుతారు. ఎవరితోనూ తగువు పడకండి ఆ ఘర్షణల ప్రభావం చాలా తీవ్రస్థాయిలో ఉంటుంది.

మకరం

మకరరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. అన్ని రంగాల వారికి ఉద్యోగ వ్యాపారాలలో కార్యసిద్ధి, శత్రుజయం ఉంటాయి. వ్యాపారస్తులు ప్రత్యర్థులపై విజయం సాధిస్తారు. సంపదలు పెరుగుతాయి. ఇల్లు, భూమి కొనుగోలు చేస్తారు. గృహంలో శాంతి సంతోషం నెలకొంటాయి.

కుంభం

కుంభరాశి వారికి ఈ రోజు బ్రహ్మాండంగా ఉంటుంది. ఆర్థిక సంబంధమైన శుభ ఫలితాలు ఈ రోజు అందుకుంటారు. చేపట్టిన పనులన్నీ విజయవంతంగా పూర్తి కావడంతో ఈ రోజంతా చాలా సంతోషంగా ఉంటారు. నూతన వాస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు.

మీనం

మీనరాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉండవచ్చు. వృత్తి ఉద్యోగ రంగాల వారికి ఆశించిన ప్రయోజనాలు ఉంటాయి. ఆత్మవిశ్వాసంతో పనిచేసి తిరుగులేని విజయాన్ని సాధిస్తారు. ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి. ఖర్చులు పెరుగుతాయి. స్వల్ప అనారోగ్య సమస్యలుంటాయి.