చాలా మంది జ్యోతిష్యాన్ని అనుసరిస్తుంటారు. రోజు వారి రాశిఫలాలకు అనుగుణంగా శుభ కార్యాలు, కొత్త పనులను ప్రారంభిస్తారు. దిన ఫలాలు చూడనిదే కొందరు ఏ పని ప్రారంభించరు. మరి నేటి రాశిఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం..
మేషం
మేష రాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. వృత్తి, వ్యాపార రంగాల వారికి ఖర్చులు పెరుగుతాయి. ఉద్యోగులకు పని ఒత్తిడి ఉన్నప్పటికినీ మీ ప్రతిభతో అధిగమిస్తారు. ఈ రాశి వారు ఆధ్యాత్మికత వైపు ఆసక్తి చూపుతారు. ఆరోగ్యం బాగానే ఉంటుంది.
వృషభం
వృషభరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. వ్యాపారులకు ఏర్పడే కొత్త పరిచయాల వలన ఆర్ధికంగా లబ్ది పొందుతారు. ఉద్యోగంలో మార్పు కోరుకునే వారికి శుభ సమయం. కుటుంబ సభ్యులతో కలిసి తీర్థయాత్రలకు వెళతారు. సంపద వృద్ధి చెందుతుంది.
మిథునం
మిథునరాశి వారికి ఈ రోజు అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. అన్ని రంగాల వారికి వృత్తి, వ్యాపారాలలో మంచి పురోగతి ఉంటుంది. మానసికంగా ప్రశాంతంగా, శారీరకంగా దృఢంగా ఉంటారు. సహోద్యోగుల సహకారం ఉంటుంది. సమాజంలో గౌరవం, ప్రతిష్ఠలు పెరుగుతాయి.
కర్కాటకం
కర్కాటకరాశి వారికి ఈ రోజు శుభకరంగా ఉంటుంది. విదేశాల నుంచి శుభప్రదమైన వార్త వస్తుంది. ఆర్ధిక ప్రయోజనాలు లభిస్తాయి. ఆకస్మిక ధనలాభాలు ఉండవచ్చు. మీ పనితీరు పట్ల పై అధికారులు సంతృప్తి వ్యక్తం చేస్తారు.
సింహం
సింహరాశి వారికి ఈ రోజు కొన్ని ప్రతికూల పరిస్థితులు ఉండవచ్చు. అనారోగ్య సమస్యల కారణంగా ఖర్చులు విపరీతంగా ఉంటాయి. తగిన విశ్రాంతి అవసరం. సమయానుకూలంగా నడుచుకుంటే సమస్యలు ఉండవు. మెరుగైన ఆర్ధిక ప్రయోజనాల కోసం కార్యసిద్ధి హనుమాన్ను ప్రార్ధించండి.
కన్య
కన్యారాశి వారికి ఈ రోజు అద్భుతంగా ఉంటుంది. అన్ని రంగాల వారు కెరీర్లో దూసుకుపోతారు. చేపట్టిన ప్రతి పనిలోను విజయం సాధిస్తారు. సంపాదన పెరుగుతుంది. కుటుంబంలో సంతోషకర వాతావరణం ఉంటుంది. గతంలో మిమ్మల్ని విమర్శించిన వారే మీ సహాయం కోరి వస్తారు.
తుల
తులారాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. నూతన వస్తు, వాహనాలు కొంటారు. ఆదాయం వృద్ధి చెందుతుంది. కుటుంబ సభ్యులతో కలిసి విహార యాత్రలకు వెళతారు. కుటుంబంలో ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది.
వృశ్చికం
వృశ్చికరాశి వారికి ఈ రోజు ఆనందదాయకంగా ఉంటుంది. మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. ఉద్యోగులకు సహోద్యోగుల సహకారం, మద్దతు ఉండవచ్చు. వ్యాపారులు వ్యూహాత్మకంగా వ్యవహరించి పోటీదారులను అధిగమిస్తారు. ధనానికి లోటుండదు.
ధనుస్సు
ధనుస్సు రాశి వారికి ఈ రోజు ప్రతికూల పరిస్థితులు గోచరిస్తున్నాయి. కోపాన్ని అదుపులో పెట్టుకోలేని మీ అశక్తత కారణంగా ఇంటా, బయటా కలహాలు పెరుగుతాయి. ముఖ్యమైన పనులను వాయిదా వేస్తే మంచిది. ఆరోగ్యపరంగా ఇబ్బందులు ఎదురవుతాయి. తగిన చికిత్స, విశ్రాంతి అవసరం.
మకరం
మకరరాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. లక్ష్య సాధన కోసం తీవ్ర కృషి అవసరం. వృత్తి వ్యాపార రంగాల వారు పనులు సకాలంలో పూర్తి చేయలేక పోతారు.ఆదాయాన్ని మించిన ఖర్చులు ఉండవచ్చు. పై అధికారుల నుంచి ఒత్తిడి ఉండవచ్చు.
కుంభం
కుంభరాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. ముఖ్యమైన వ్యవహారాల్లో నిర్ణయాలు తీసుకోవడంలో సందిగ్దత నెలకొంటుంది. వృత్తి వ్యాపార రంగాల వారికి పనిభారం పెరుగుతుంది. కోపాన్ని అదుపులో పెట్టుకోకపోతే, కుటుంబ సభ్యులతో వాగ్వివాదాలు రావచ్చు. ఖర్చులు అదుపులో ఉంచుకోవాలి.
మీనం
మీనరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. అన్ని రంగాల వారికి అనుకున్న పనులు అనుకున్నట్లుగా పూర్తవుతాయి. ఆర్ధికంగా శుభ ఫలితాలు ఉంటాయి. ఒక శుభవార్త మీ ఇంట్లో ఆనందాన్ని నింపుతుంది. ఖర్చులు అదుపులోనే ఉంటాయి. సంపాదన పెరుగుతుంది.